Thursday, 04 Mar, 6.35 am ఈనాడు

ప్రకాశం
ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా బంద్‌

చీరాల: బంద్‌ గోడపత్రాలను ఆవిష్కరిస్తున్న అఖిలపక్ష నాయకులు

చీరాల, మార్టూరు, ఇంకొల్లు- న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 5న నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. ఎందరో ప్రాణత్యాగాలతో సాధించుకున్న కర్మాగారాన్ని పోస్కో కంపెనీకి కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలన్నారు. సంస్థకు ఉన్న బకాయిలను రద్దు చేసి, సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తీవ్రస్థాయిలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు చేపడుతున్న బంద్‌లో అందరూ పాల్గొనాలని కోరారు. సంబంధిత గోడపత్రాలను చీరాల, మార్టూరు, ఇంకొల్లులో బుధవారం ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో వివిధ సంఘాలు, సంస్థల నాయకులు ఎ.బాబూరావు, చీకటి శ్రీనివాసరావు, వసంతరావు, మేడ వెంకట్రావు; బత్తుల హనుమంతరావు, మహ్మద్‌ బాషా, కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి పేరం ప్రభాకర్‌, సూరిబాబు; హనుమయ్య, వెంకట్రావు, రామకోటేశ్వరారవు, సింగయ్య, ఆయేషా బుడే, రాంబాబు, ఉమ్రాన్‌ అలి, అంజయ్య పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top