Sunday, 15 Sep, 3.30 am ఈనాడు

మెదక్
వరుస చోరీల ఘటనలో ఇద్దరి రిమాండ్‌

భూంపల్లి కూడలి (మిరుదొడ్డి) న్యూస్‌టుడే: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు భూంపల్లి ఎస్‌ఐ రాజేశ్‌ శనివారం తెలిపారు. వివరాలు.. ఈనెల 9న భూంపల్లి కూడలిలో ఉన్న థామస్‌ జాన్సన్‌ కోళ్లఫారంలో రిఫ్రిజిరేటర్‌తో పాటు రెండు సిలిండర్లు చోరీకి గురవగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. నిఘా నేత్రాల ఆధారంగా దుబ్బాక మండలం నగరం గ్రామానికి చెందిన నగేష్‌, పోతారెడ్డిపేటకు చెందిన స్వామిలు వాటిని చోరీ చేసినట్లు ఆధారాలు లభించాయన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు నగేష్‌ నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ద్విచక్ర వాహనం, రెండేళ్ల కిందట పెద్ద నిజాంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రొజెక్టర్‌తో పాటు టీవీలను చోరీ చేసినట్లు నేరం అంగీకరించాడన్నారు. వారినుంచి చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top