Friday, 23 Oct, 4.41 am ఈనాడు

అదిలాబాద్
వేలిముద్రలు పడని వారికి బియ్యం పంపిణీ

మూడోవ్యక్తి ధ్రువీకరణకు అంగీకారం


'ఈనాడు'లో ప్రచురితమైన కథనం

భీంపూర్‌, న్యూస్‌టుడే : పండగపూట వేలిముద్రలు పడక ఉచిత బియ్యానికి దూరమైన పండుటాకులకు, ఒంటరి మహిళలకు అధికారులు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. మూడో వ్యక్తి వేలిముద్రలతో వారికి బియ్యం పంపిణీ అయ్యే చర్యలు చేపట్టారు. వేలిముద్రలు పడని కార్డుదారుల అవస్థలపై 'ఉచితబియ్యం వారికి దూరం' శీర్షికన 18న 'ఈనాడు'లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన అధికారులు ఆయా మండలాల తహసీల్దార్ల నుంచి బాధితుల వివరాలు తెప్పించుకుని ఆయా రేషన్‌ దుకాణల పరిధిలో థర్డ్‌ పర్సన్‌ అథంటికేషన్‌కు అవకాశం కల్పిస్తూ వీఆర్‌ఏ సహాయంతో బియ్యం పంపిణీ ప్రారంభించారు. భీంపూర్‌ మండలం అంతర్గాం, పిప్పల్‌కోటి, అర్లి-టి, గోముత్రి, కరంజి-టి తదితర గ్రామాల్లో ఆయా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేశారు. జిల్లాలోనూ ఇతర గ్రామాల్లోనూ కార్డుదారులు బియ్యం తీసుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. 25 వరకు బియ్యం పంపిణీకి గడువును పొడిగించారు.


వీఆర్‌ఏ వేలిముద్రతో బియ్యం తీసుకుంటున్న వృద్ధులు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top