Thursday, 15 Nov, 4.56 am ఈనాడు

వికారాబాద్
వికారాబాద్‌ తెరాస అభ్యర్థిగా మెతుకు ఆనంద్‌

న్యూస్‌టుడే, వికారాబాద్‌: వికారాబాద్‌ నియోజకవర్గ తెరాస అభ్యర్థి ఎంపికపై వస్తున్న ఉహాగానాలకు తెరపడింది. పార్టీ అధిష్ఠానం బుధవారం రాత్రి అభ్యర్థిగా డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ను ఖరారు చేసింది. దీంతో నాయకులు, కార్యకర్తలు ఆనందŸం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రచారానికి కార్యాచరణ చేపట్టాలన్న సమాలోచనలు చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు.. పేరు: డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ తల్లిదండ్రులు: సాయమ్మ, పోచయ్య పుట్టిన తేది: 4 జూన్‌ 1974 విద్యార్హత: ఎంబీబీఎస్‌(గాంధీ వైద్య కళాశాల, హైదరాబాద్‌), ఎంఎస్‌, ఎండీ(కాకతీయ వైద్య కళాశాల, వరంగల్‌), ః స్వగ్రామం: కేరెళ్లి, ధారూర్‌ మండలం, వికారాబాద్‌ జిల్లా భార్య: డాక్టర్‌ సబితా, ః సంతానం: వినూత్న(8వ తరగతి), వైభవ్‌(7వ తరగతి) రాజకీయ నేపథ్యం: వైద్యుల ఐకాస అధ్యక్షుడు, 2013-14లో వికారాబాద్‌ నియోజకవర్గ తెరాస ఇన్‌ఛార్జి.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top