VIRAL: సముద్ర లోతుల్లోకి ఎలా వెళ్లాలంటే..!
29 November 2020, 8:00 pm
ఇంటర్నెట్ డెస్క్: సముద్ర గర్భంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉంటాయి. లోతైన మహా సముద్రాల అడుగు భాగంలో ఏమి ఉంటుందో తెలుసుకోవాలని శాస్త్రవేత్తలతో పాటు సాధారణ ప్రజానీకానికి ఆసక్తి ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక వీడియోను గిన్నిస్ బుక్ రికార్డ్స్ సంస్థ యూట్యూబ్లో ఉంచింది. వీడియోలో అమెరికాకు చెందిన నావికాదళ మాజీ అధికారి అయిన విక్టర్ వెస్కోవో తాము సముద్ర లోతులోకి ఎలా చేరుకుంటామో వివరించారు. సూర్యరశ్మిని తాకని, ఆక్సిజన్ అందని ప్రదేశంలో ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కొంటామో చెప్పారు. వీడియోను దాదాపు 50వేల మంది వరకు వీక్షించగా.. 2వేలకుపైగా లైకులు వచ్చాయి. సముద్రంలోని లోతైన విశేషాలను తెలుసుకోవాలనుందా..
Loading...