Saturday, 14 Sep, 5.30 am ఈనాడు

మెదక్
విటమిన్‌ ఏదీ?

● ఆసుపత్రులకు నిలిచిన ద్రావణం సరఫరా

● సకాలంలో స్పందిస్తే ప్రయోజనం

న్యూస్‌టుడే, కందనూలు

చిన్నారులు ఆరోగ్యంగా ఉండటానికి, దృష్టిలోపం నివారించడానికి సరఫరా చేసే ఏ విటమిన్‌ ద్రావణం పంపిణీ ఆగింది.. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అంగన్‌వాడీ కేంద్రాలకు, గ్రామీణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ ద్రావణం సరఫరా నిలిపివేయడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.. భవిష్యత్తులో దృష్టి లోపాలు తలెత్తకుండా ద్రావణం సరఫరా చేయాలని కోరుతున్నారు..

జిల్లాలోని అంగన్‌వాడీ, గ్రామీణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విటమిన్‌ ద్రావణం సరఫరా చేసేది. వీటిని ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు కలిసి 9 నెలల శిశువు నుంచి అయిదు సంవత్సరాలలోపు చిన్నారులకు షెడ్యూల్‌ ప్రకారం తాగించేవారు. ఈ విటమిన్‌ వల్ల దృష్టిలోపం రాకుండా నివారించొచ్ఛు దాదాపు ఏడాదిగా ఈ ద్రావణం సరఫరా లేదు. దీంతో వైద్య సిబ్బంది చిన్నారులకు సాధారణ టీకాలు మాత్రం వేస్తున్నారు.

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు : 908

నమోదైన బాలింతలు : 4,999

గర్భిణులు : 5,276

మూడేళ్లలోపు చిన్నారులు : 25,200

మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు : 15,848

సరఫరా నిలిచిపోయింది : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు ఏడాది నుంచి ఏ విటమిన్‌ ద్రావణం సరఫరా నిలిపివేసింది. దీంతో ఆసుపత్రుల్లో చిన్నారులకు సాధారణ టీకాలు మాత్రమే ఇస్తున్నాం. చిన్నారులకు ఏ విటమిన్‌ ద్రావణం తాగించడం వల్ల దృష్టిలోపం నివారించడానికి వీలు ఉంటుంది. జిల్లాలోని చిన్నారుల సంఖ్యను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించాం.

- డా.సాయినాథ్‌, జిల్లా టీకీకరణ అధికారి

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top