Saturday, 27 Jan, 5.22 am ఈనాడు

తూర్పు గోదావరి
యువత హేతుబద్ధంగా ఆలోచించాలి


కడియం, న్యూస్‌టుడే : కడియం పల్ల వెంకన్న నర్సరీలో శుక్రవారం హేతువాది బాబు గోగినేని ముఖపుస్తక మిత్ర బృందం ఆధ్వర్యంలో మానవవాదుల సదస్సు జరిగింది. మూడు రోజులపాటు జరిగే సదస్సులో బాబు గోగినేని మాట్లాడుతూ రాజమహేంద్రవరం సంఘ సంస్కర్తలకు నిలయమని, దేశంలో వందకోట్ల పైబడి ఉన్న జనాభాలో 70 శాతం మంది 35 ఏళ్లలోపు యువతేనని, రానున్న రోజుల్లో యువతకు దిశానిర్దేశం ఎలా ఉండాలో చర్చించుకోవడానికి 200 మంది తమ సొంత ఖర్చులతో ఇక్కడికి వచ్చారన్నారు. మూఢాచారాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. సైన్సునే విశ్వసించాలని, ఆధునిక మోసాలకు గురికావద్దన్నారు. హేతుబద్దంగా ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా కొండేపూడి నిర్మల రచించిన 'మృదంగం' పుస్తకాన్ని, నేత్రదాన ప్రోత్సాహక సంఘం అధ్యక్షుడు పెనుమత్స సుబ్బరాజు రచించిన 'దైవ దర్శిని', 'బైబిల్‌ ఇదే' పుస్తాకాలను బాబు గోగినేని చేతుల మీదుగా ఆవిష్కరించారు. సదస్సులో ఐఎన్‌ఏ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం, మండల విద్యాశాఖాధికారి వి.లజపతిరాయ్‌, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు, సదస్సు ప్రతినిధులు జయంతి విశ్వనాథ్‌, పెనుమాక సుబ్బరాజు, న్యాయవాది తోరాటి వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top