Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అజిత్ దోవల్ పైనే ట్రోల్స్ ..తినే తిండిని వదలరా..

అజిత్ దోవల్ పైనే ట్రోల్స్ ..తినే తిండిని వదలరా..

EhaTV 6 days ago

ఒక అంతర్జాతీయ సదస్సు…ప్రపంచ దేశాల నేతలు ఒకే వేదికపై…

చర్చించాల్సిన అంశాలు ఎన్నో…కానీ అసలు విషయం పక్కన పెట్టి

తినే తిండి గురించే ట్రోల్స్ చేసే స్థాయికి సోషల్ మీడియా , అంతర్జాతీయ మీడియా పడిపోయింది

ఇండియా ప్రపంచ వేదికపై శరవేగంగా దూసుకెళుతుంది ..కానీ అంతర్జాతీయ మీడియాకి మన దేశం అంటే ఇంకా చిన్న చూపే ..దేశాన్ని వెనుకబడిన దేశంగానే చిత్రీకరించే ప్రయత్నమే .. అలాంటి వారు తిండిపై కూడా ట్రోల్స్ చేయడం పెద్దగా ఆశ్చర్యపరచదు..భారత అధికారులు ఏం తింటున్నారు అనేది వాళ్ళ ట్రోల్స్ కి దొరికిన అంశంగా మారింది ..వాటిపై మీమ్స్… ట్రోల్స్… కామెంట్స్… భారత ప్రతినిధుల ఆహారాన్ని విమర్శించడం సమంజసమేనా.. బ్రిక్స్‌ వంటి అంతర్జాతీయ సమావేశాల్లో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటారు.వారికి వేదిక వద్ద భోజనం, స్నాక్స్, ఆహార ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో భారత ప్రతినిధులు భోజనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలోకి రావడంతో… కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు .. అవి కూడా త్రిబుల్ ఎక్స్ స్పీడ్ లో వీడియోని వైరల్ చేస్తూ ..ఇక్కడ ఈ వీడియోలో చూస్తే..మన అధికారులని ట్రోల్స్ చేయడానికి వారు ఎంతగా దిగజారుతారో అర్ధం అవుతుంది .. తినే విధానాన్ని కూడా ట్రోల్స్ చేస్తున్నారు , విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మరియు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్నాక్స్ తింటున్న వీడియోలను విపరీతంగా ప్రచారం చేశారు. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారిని ఇలా ట్రోల్ చేయడం ఎందుకు.. ఆహారం… నిజంగా అంత పెద్ద విషయమా ..ఒక వ్యక్తి ఏం తింటాడు..ఎలా తింటాడు.. అనేది అతని వ్యక్తిగత విషయం. అంతర్జాతీయ సమావేశానికి వెళ్లిన ప్రతినిధి కూడా చివరికి మనిషే. సమావేశాల్లో గంటల తరబడి చర్చలు, ప్రయాణాలు, అధికారిక కార్యక్రమాలు ఉంటాయి. అలాంటి సమయంలో భోజనం చేయడం సహజమైన విషయమే. అయితే ఒక దేశాధ్యక్షుడు మాట్లాడుతుంటే .. శ్రద్దగా వినాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది ..ప్రతి సెకన్ ఎం మాట్లాడుతారు అనేది కీలకమే ..అలాంటి సమయంలో తింటూ విడియోలకి చిక్కి విమర్శకులకు వీళ్ళే అవకాశం ఇచ్చారని కూడా చెప్పవచ్చు .. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి ..ఎందుకంటే

సోషల్ మీడియాలో ఒక ఫొటో బయటకు వచ్చిందంటే… దానికి వెంటనే ఒక కథను జోడించడం మొదలవుతుంది. సోషల్ మీడియా కాలంలో ఒక విషయం వైరల్ కావడానికి పెద్ద కారణం.. కాంట్రవర్సీ. సాధారణమైన ఫొటో కంటే… విమర్శించే ఫొటో ఎక్కువగా షేర్ అవుతుంది. ఒకరు కామెంట్ చేస్తారు. మరొకరు దానికి రిప్లై ఇస్తారు.ఇంకొకరు మీమ్ తయారు చేస్తారు. చివరికి అసలు సందర్భం పక్కకు వెళ్లిపోతుంది.

అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ప్రభుత్వ అధికారులు లేదా ప్రజా ప్రతినిధుల విషయంలో ప్రశ్నించే హక్కు ఉంది. ఆహార ఏర్పాట్లకు ప్రభుత్వ నిధులు ఖర్చయ్యాయా,, ప్రోటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు జరిగాయా,, ప్రతినిధులకు సరైన సౌకర్యాలు కల్పించారా.. ఇలాంటి ప్రశ్నలు అడగడం తప్పు కాదు. కానీ…

ప్రశ్నించడం వేరు… వ్యక్తిగతంగా అవమానించడం వేరు. విమర్శకు కూడా ఒక హద్దు ఉండాలి.. మనకు నచ్చని విషయం కనిపిస్తే విమర్శించవచ్చు. కానీ ఒక వ్యక్తి ఫొటోను తీసుకుని… అతని రూపం, ఆహారం, వ్యక్తిగత అలవాట్లపై కామెంట్లు చేయడం…

అది విమర్శ కంటే ట్రోలింగ్‌గా మారుతుంది. అంతర్జాతీయసదస్సులో భారతదేశం తరఫున పాల్గొన్న అధికారులు ఏ అంశాలపై చర్చించారు.. భారత్‌కు ఏం సాధించారు.. దేశ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయాలు తీసుకున్నారు.. ఇవే అసలు చర్చించాల్సిన అంశాలు. ప్లేట్‌లో ఏముంది..ఎలా తింటున్నారు అనేది కాదు . బ్రిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికలు దేశాల మధ్య సంబంధాలు, ఆర్థిక సహకారం, వాణిజ్యం, భద్రత వంటి కీలక అంశాలపై చర్చించడానికి ఉపయోగపడతాయి.అలాంటి వేదికపై మన ప్రతినిధులు ఏం తిన్నారు అనేది ఆసక్తికరమైన విషయం కావచ్చు. కానీ వాళ్ళు తిన్న విధానాన్ని ట్రోల్ చేయడం తప్పు ..

ఇక బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన ఒక సంఘటన వైరల్ అయింది. ఈ విడియోలో మోదీ, పుతిన్‌ను లాగుతున్నట్లుగా ఉంది .. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ , చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్‌లతో కలిసి నవ్వుతూ, చేతులు పట్టుకుని దిగిన అసలైన ఫోటోలను మార్పింగ్ చేసి వైరల్ చేస్తున్నారు .. పుతిన్ మోదీతో ఫోటో దిగడానికి నిరాకరించారంటూ కొన్ని ఎడిట్ చేసిన వీడియోలు, క్లిప్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఒక మంచి ని మంచి అని చెప్పుకున్నా ..చెడుగా ప్రచారం చేసి సాధించేది ఏమి లేదు .. దేశానికి ఎంతో సేవ చేసిన అజిత్ దోవల్ వంటి వారి స్థాయిని ఇలాంటి వీడియోస్ వలన ఏ మాత్రం తగ్గించలేరు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ట్రోలర్స్ కి ఉంది ..వారి గౌరవం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: EhaTV Telugu News