Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Caste Census : కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్..!

Caste Census : కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్..!

EhaTV 4 days ago

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కులగణన అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కులగణనను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ప్రధాన న్యాయమూర్తి సూర్యాకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

పిటిషనర్‌ కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణనను ఆపాలని కోర్టును ఆశ్రయించారు. అయితే, కులగణన అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో న్యాయస్థానాల జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. వెనుకబడిన వర్గాల అసలు జనాభా, వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులు తెలిసినప్పుడే సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయగలమని కోర్టు అభిప్రాయపడింది.

"సమగ్ర అభివృద్ధి కోసం ఖచ్చితమైన గణాంకాలు అవసరం. కులాల వారీగా సమాచారం ఉంటేనే ప్రభుత్వాలు లక్ష్యిత సంక్షేమ కార్యక్రమాలు రూపొందించగలవు" అని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు సమాచారం. అలాగే కులగణనపై తీసుకునే నిర్ణయాలు కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి వస్తాయని, కోర్టులు విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది.

ఇక విచారణ సందర్భంగా పిటిషన్‌లో ఉపయోగించిన భాషపై కూడా సీజేఐ సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుచిత పదజాలం ఉపయోగించడంపై పిటిషనర్‌ను మందలిస్తూ, చివరికి పిటిషన్‌ను తిరస్కరించారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: EhaTV Telugu News