ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న పరశురామ్.. ఆదివారం రాత్రి మద్యం సేవించి భార్య శివానితో గొడవకు దిగాడు.ఈ క్రమంలో తీవ్ర కోపోద్రిక్తుడై.. శివాని గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం..
శివాని బాత్రూంలో జారి పడి మృతి చెందిందని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు.అయితే..పోలీసులకు అనుమానం రావడంతో పరశురామ్‌ను విచారించారు. విచారణలో తానే భార్యను హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.దీంతో నిందితుడు పరశురామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

