Dailyhunt
Karnataka : ప్రియుడితో గడిపిన ఫొటోలు వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టిన భార్య..! తట్టుకోలేక భర్త..!

Karnataka : ప్రియుడితో గడిపిన ఫొటోలు వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టిన భార్య..! తట్టుకోలేక భర్త..!

EhaTV 1 week ago

త్తరకన్నడ జిల్లా దాండేలి పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబ బంధాలపై మరొకసారి చర్చకు దారి తీసింది. భార్య ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం.

పట్టణానికి చెందిన రాఘవేంద్ర వాడకర్‌ మలేషియాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇదే సమయంలో ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన అతని భార్య, తాను ఇక ఈ వివాహ బంధాన్ని కొనసాగించాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. ఆమె మరో యువకుడితో కలిసి దిగిన ఫోటోను రాఘవేంద్రకు పంపించి, వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. తనతో జీవించడం ఇష్టం లేదని, అతనితో సంబంధం కొనసాగించబోనని తేల్చి చెప్పింది,

భార్యను ఒప్పించేందుకు రాఘవేంద్ర పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. తీవ్ర ఆవేదనలో అతను తనను తాను గాయపరుచుకుని వాటి ఫోటోలను పంపించాడు. అయినప్పటికీ పరిస్థితి మారకపోవడంతో, చివరకు జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందు తన భార్య ప్రవర్తనపై ఒక లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: EhaTV Telugu News