ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురానికి చెందిన శ్రీనివాసరావు.. తన ఇద్దరు పిల్లలను పురుగుల మందు తాగించి, తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.శ్రీనివాసరావు తన పిల్లలు లాస్య, నిఖిల్‌ను ఏపీ గండ్రాయి శివారుకు తీసుకెళ్లినట్లు సమాచారం.అక్కడ తాను పురుగుల మందు తాగడంతో పాటు..
ఇద్దరు పిల్లలకు కూడా బలవంతంగా పురుగుల మందు తాగించినట్లు తెలుస్తోంది.అనంతరం తన బావమరిదికి ఫోన్ చేసి పురుగుల మందు తాగినట్లు చెప్పి.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు సాంకేతిక సహాయంతో వారి ఆచూకీ గుర్తించి ఆస్పత్రికి తరలించారు.అయితే చికిత్స పొందుతూ శ్రీనివాసరావు, అతడి కుమార్తె లాస్య మృతి చెందారు. కుమారుడు నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.కుటుంబ కలహాలా? లేక ఇతర కారణాలా? ఈ దారుణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

