బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి .. ఉపఎన్నికలు జరగనున్న వేళ మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్ అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో నుంచి బంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్గం అభ్యర్థి సంచిత ప్రధాన్ దేవ్ అనూహ్యంగా తప్పుకున్నారు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడానికి ఒక్క రోజు ముందు ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నందిగ్రామ్ నుంచి మమతా వర్గం తరఫున బరిలోకి దిగిన సంచిత ప్రధాన్ దేవ్ తన భర్త సత్యజిత్‌తో కలిసి సచివాలయంలో సీఎం సువేందు అధికారితో భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే ఆమె తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. దీంతో ఉపఎన్నికలో నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వర్గానికి అభ్యర్థి లేకుండా పోయారు. ఈ పరిణామాలపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను విచ్ఛిన్న చేయడం, బలహీనపరచడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని మమత ఆరోపించారు. అలాగే, 28 ఏళ్లుగా ఉన్న తమ పార్టీ అధికారిక గుర్తును ఈసీ ఏ విధంగా స్తంభింపజేస్తుందని ప్రశ్నించారు. ఆ పరిణామాన్ని ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా మమతా అభివర్ణించారు. 'గత 28 ఏళ్లుగా తమ వద్ద ఉన్న గుర్తును ఈసీ ఎలా స్తంభింపజేయగలరు అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో టీఎంసీలోని తిరుగుబాటు నేతలు బీజేపీకి పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేవలం బంగాల్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలను అపహాస్యం చేసిందని ఆరోపించారు.
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ,ముందు ఉద్ధవ్ ఠాక్రే పార్టీని,ఆ తర్వాత ఎన్‌సీపీని విచ్ఛిన్నం చేశారు. ఇప్పుడు మాపై పడ్డారు. టీఎంసీ పేరు, దాని గుర్తును నిలవనివ్వనని సువేంధు అధికారి గతంలోనే చెప్పారు. కానీ, వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి మేం తలవంచం"అని మమతా ఆరోపించారు ..టీఎంసీ అభ్యర్థి పోటీ నుంచి వైదొలగడంతో. మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అంతేకాకుండా, టీఎంసీ పార్టీ పేరు, గుర్తు కోసం జరుగుతున్న పోరాటంలో కాంగ్రెస్ మద్దతు తనకు ఉందని ఆమె తెలిపారు. ' మేమంతా ఏకతాటిపై ఉన్నాం. బీజేపీ ముందు మేము లొంగిపోయేది లేదుఅని దీదీ స్పష్టం చేశారు. నందిగ్రామ్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ స్వయంగా పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదట వచ్చాయట.అయితే ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో భాగంగా నియామకాలు రద్దవ్వడంతో ఉద్యోగం కోల్పోయిన ఒక టీచర్ సంచితని ఆమె నిలబెట్టారు ..కానీ బీజేపీ స్కెచ్ తో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు .. మరి కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిన మమత హస్తం అభ్యర్థిని గెలిపించి తన సత్తా చాటుతుందా.సీఎం సువెందు గేమ్ ప్లాన్ కి తలోగ్గుతుంద అనేది ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టం అవుతుంది.

