Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ponguleti Srinivas Reddy : ఓం..భీమ్..బుష్..హరీష్..పొంగులేటి సంచలన ట్వీట్

Ponguleti Srinivas Reddy : ఓం..భీమ్..బుష్..హరీష్..పొంగులేటి సంచలన ట్వీట్

EhaTV 1 week ago

దవుల కోసం, పైసల కోసం హరీష్ రావు ఎంత నీచానికైనా దిగజారుతారనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.

ఆనాడు అగ్గిపెట్టె లేదంటూ యువకులను రెచ్చగొట్టి శవ రాజకీయాలు చేసిన హరీష్ రావు ...అధికారంలో ఉన్నప్పుడు పైసల కోసం మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని అనైతికంగా ఆసుపత్రులతో పాల వ్యాపారం చేశారు.

చివరికి బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసేందుకు హరీష్ రావు మరింతగా దిగజారారు. మామ కేసీఆర్ గారి ఆరోగ్యం బాగుండకూడదని హరీష్ రావు క్షుద్రపూజలు చేయించారని స్వయంగా కేసీఆర్ గారి కుమార్తె కవిత ప్రకటించారంటే, హరీష్ రావు వ్యక్తిత్వం ఎంత నీచమైనదో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి తప్పుడు మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టే... తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హరీష్ రావు ప్రతిరోజూ చేస్తున్న అసత్య ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు.

మామ కేసీఆర్‌ గారిపై క్షుద్రపూజల దగ్గర నుంచి పాల పేరుతో చేసిన పాపపు వ్యాపారాల దాకా అన్ని అవలక్షణాలు ఉన్న అగ్గిపెట్టెరావు, ఒక్కటి గుర్తుపెట్టుకో... ఎన్ని కుట్రలు చేసినా, ప్రతి రోజు పెయిడ్ సోషల్ మీడియాలో ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా…ధరణి పేరుతో దొరలు చేసిన దోపిడీని బయటికి తీయడం ఖాయం. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి, పేదల సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు గుడిసెలు లేని తెలంగాణను నిర్మించడం కూడా ఖాయం.

హరీష్ రావు... నీ కుట్రలు, ప్రజలకు మంచి చేయాలనే, గొప్ప పరిపాలన అందించాలనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని అడ్డుకోలేవు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: EhaTV Telugu News