తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టు ల్లో భారత్ ఫ్యూచర్ సిటీ ఒకటి .. రాజధానిలో తన మార్క్ ఉండాలనే ఉద్దేశ్యంతో పాటు నగరాన్ని విస్తరించి అవకాశాలు మెరుగుపరచాలనే ఆలోచనతో ఆయన ఫ్యూచర్ సిటీ కి శ్రీకారం చుట్టారు ..
ఆ ప్రాజెక్టు పై మొదటి నుంచి అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి ..అయినా సీఎం ముందుకు వెళుతూనే ఉన్నారు ..
రేవంత్ ఫ్యూచర్ సిటీ ఆలోచన చేసినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయి రాజకీయ సమరానికి వేదికగా మారింది. అంతర్జాతీయ వేదికలపై, అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఫ్యూచర్ సిటీని మణిహారంగా మార్చేందుకు కష్టపడుతున్నా అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు అయితే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం.. ఫ్యూచర్ సిటీకి అసలు భవిష్యత్తే లేదు, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును రద్దు చేస్తాం, ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దు అని ఓపెన్ వార్నింగ్ ఇవ్వడం ...అటు పారిశ్రామిక, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.
కేటీఆర్ మాటల వెనుక చట్టపరమైన సవాలు కూడా ఉందని చెప్పవచ్చు . గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముచ్చర్ల ప్రాంతంలో దాదాపు 14,000 ఎకరాల భూమిని హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం సేకరించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. ఒక నిర్దిష్ట ప్రభుత్వ లేదా పబ్లిక్ ప్రయోజనం కోసం సేకరించిన భూమిని, ఆ ప్రయోజనానికి వాడకుండా రియల్ ఎస్టేట్ రంగానికి లేదా ఇతర వాణిజ్య అవసరాలకు మళ్లించడం చట్టరీత్యా చెల్లదు. ఫార్మా సిటీని రద్దు చేసి, అదే భూమిలో సీఎం తన కుటుంబ సభ్యులు, అస్మదీయుల లబ్ధి కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనేది కేటీఆర్ .అలాగే బిఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ.
అయితే ఏదైనా ఒక ప్రాజెక్టు గురించి కోర్టుల్లో చిక్కుముళ్ళు పడినా, భూసేకరణ చెల్లదని రైతులు కోర్టును ఆశ్రయించినా .. ఆ పెట్టుబడుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇటీవల కేటీఆర్ తుక్కుగూడ, రావిర్యాల పరిసరాల్లో పర్యటించి, కొన్ని సంస్థలకు తక్కువ ధరకు భూకేటాయింపులు జరిగాయని ఆరోపిస్తూ నేరుగా భూములను సందర్శించడం ద్వారా ఇన్వెస్టర్లలో ఆందోళన కలుగుతుంది . ఏ బహుళజాతి కంపెనీ అయినా స్థిరమైన విధానాలు, న్యాయపరమైన చిక్కులు లేని భూములనే కోరుకుంటుంది ..ఒకవేళ ప్రభుత్వం మారితే రద్దయ్యే ప్రాజెక్టుల్లో వందల కోట్లు పెట్టడానికి కంపెనీలు సాహసించవు.సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రతిష్టను పెంచుతా అని ,, ఏఐ , గ్రీన్ ఎనర్జీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి గ్లోబల్ ట్రెండ్స్‌కు అనుగుణంగా రీబ్రాండ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నా అని చెబుతున్నారు.ఫార్మా రంగాన్ని హైదరాబాద్ సమీపంలో కాకుండా ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల క్లస్టర్లుగా విస్తరించి, ఫార్మా కోసం తీసుకున్న భూమిలో క్లీన్-టెక్, డిఫెన్స్, ఐటీ ఆధారిత ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా నగర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించవచ్చని కాంగ్రెస్ చెబుతుంది.అభివృద్ధిని చూసి తట్టుకోలేక కేటీఆర్ ప్రతికూల ప్రచారం చేస్తున్నారని అంటుంది.
పొలిటికల్ వార్‌లో ప్రధాన నష్టం జరిగేది తెలంగాణ పారిశ్రామిక వాతావరణానికే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మా ప్రభుత్వం వస్తే ఈ ఒప్పందాలను రద్దు చేస్తాం అని ప్రతిపక్షం బహిరంగంగా ప్రకటిస్తే, అది నూతన పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని, అభద్రతాభావాన్ని పెంచుతుంది. అందుకే రేవంత్ రెడ్డి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ఫార్మా సిటీ భూములను ఫ్యూచర్ సిటీకి మళ్లించడంలో ఉన్న న్యాయపరమైన అడ్డంకులను చట్టబద్ధంగా తొలగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరోవైపు, రాజకీయ విభేదాలు ఏవైనా ఉన్నప్పటికీ, రాష్ట్ర భవిష్యత్తు , యువత ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్'ను దెబ్బతీసేలా నేరుగా పెట్టుబడిదారులను బెదిరించే స్థాయి వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ కేజీ ఏ మేరకు కలసి వస్తుంది .. కేటీఆర్ చెబుతున్నా ..ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ నినాదాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది రాజకీయంగా కీలకమైంది ..అయితే రానున్న రెండేళ్లలో ఏ మేరకు పనులు జరుగుతాయి .. ఫ్యూచర్ సిటీ భూముల చట్టబద్దత ఏంటి అనేది ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయనుంది.

