Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vijayasai Reddy : ఏపీలో కొత్త రాజకీయ పార్టీ..?

Vijayasai Reddy : ఏపీలో కొత్త రాజకీయ పార్టీ..?

EhaTV 2 weeks ago

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఏర్పాటుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.వివిధ మీడియా కథనాల ప్రకారం, కొత్త పార్టీ ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక సభలు, ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ నిర్మాణంపై ముందుకు వెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది.టీడీపీ, వైఎస్సార్‌సీపీకి ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ వేదికను తీసుకురావాలనే లక్ష్యంతో విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే, ఈ ప్రచారంపై విజయసాయిరెడ్డి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇవి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంగానే పరిగణించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: EhaTV Telugu News