ఏపీ మాజీ సీఎం జగన్ ,అతని సోదరు షర్మిల .ఇద్దరూ కూడా కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. జగన్ తో విభేదించిన షర్మిల కాంగ్రెస్ లో చేరి పీసీసీ చీఫ్ అయ్యారు.
తరచూ జగన్ ని విమర్శిస్తున్నారు .. అయితే ఇప్పుడు షర్మిల తన కుమార్తె వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన అన్న జగన్ నివాసానికి షర్మిల తన కుటుంబంతో సహా వెళ్లారు .. తల్లి విజయమ్మ కుటుంబ వ్యవహారాలన్నీ చక్కబెట్టే బాధ్యత తీసుకున్నారనే వార్తల నేపథ్యంలో ..
తాజా భేటీ ఆసక్తి కరంగా మారుతోంది. బెంగళూరులో వైఎస్ జగన్ ఇంటికి సోదరి షర్మిల తల్లిని వెంటపెట్టుకుని వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 24న షర్మిల కుమార్తె అంజలిరెడ్డితో ఎన్ఆర్ఐ యువకుడు డాక్టర్ సోమల రఘురామిరెడ్డి నిశ్చితార్థం జరగనుంది ... అలాగే నవంబర్ 25న బెంగళూరులో పెళ్లి జరగనుంది.
అనంతరం డిసెంబర్ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఇవ్వనున్నారు. వివాహ పత్రికను మొట్టమొదటగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి సమాధి వద్ద వుంచి షర్మిల దంపతులు ఆశీస్సులు తీసుకున్నారు. ఇదే సందర్భంలో వివాహ పత్రికను అన్న వైఎస్ జగన్, వదిన భారతికి అందజేసి ఆహ్వానించడానికి షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు బెంగళూరులో జగన్ ఇంటికి విజయమ్మతో కలిసి షర్మిల వెళ్లారు ..
.అన్నతో వ్యక్తిగత విభేదాలు కారణంగా షర్మిల రాజకీయంగా కూడా వేరే దారి ఎంచుకున్నారు.. అయితే కొంత కాలంగా జగన్‌పై ఎలాంటి విమర్శల్ని షర్మిల చేయడం లేదు. దీంతో అన్నతో షర్మిల రాజీకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జగన్ ఇంటికి షర్మిల వెళ్లడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది ..\ ఇక మేనకోడలి నిశ్చితార్థానికి జగన్ దంపతులు వెళ్తారా..
లేదా..అనేదిప్పుడు ప్రధాన చర్చనీయాంశం. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థానికి జగన్ దంపతులు వెళ్లారు. ఆ సమయంలో అన్నావదినల విషయంలో షర్మిల అమర్యాదగా వ్యవహరించడం వైసీపీ శ్రేణుల్ని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. అయితే ఇప్పుడు విజయమ్మ బాధ్యత తీసుకోవడంతో అంతా సవ్యంగానే జరుగుతుంది అని భావిస్తున్నారు

