ప్రపంచం
రష్యాలో అట్టుడుకుతున్న ఆందోళనలు

* ప్రతిపక్ష నేత అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన
* 2 వేల మంది నిరసన కారుల అరెస్టు
మాస్కో: రష్యాలో ఆందోళనలు అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్ ని అరెస్టుకు వ్యతిరేకంగా వేలాదిమంది నిరసన కారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.
Read Also
ఈ ఆందోళనల్లో ఆయన మద్దతుదారులు, పలు యూనివర్సిటీల విద్యార్థులు స్వచ్చందంగా ర్యాలీలు తీస్తున్నారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 2 వేల మందికి పైగా నిరసన కారులను పోలీసులు అరెస్టు చేశారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Fb Telugu