Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

FilmyFocus 2 days ago

కేజీఎఫ్‌, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫస్ట్ టైమ్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన తెలుగు మూవీ 418. చైత్ర జే ఆచార్‌, చరణ్ లక్కరాజు, సూర్యరాజ్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించారు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ హారర్ మూవీ ఎలా ఉంది? ప్రజెంటర్‌గా ప్రశాంత్ నీల్‌కు 418తో హిట్ దక్కిందా? లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…

418 Movie Review

కథ: వికాస్ (సూర్యరాజ్‌), రోహిత్ (చరణ్ లక్కరాజు) మెడిసిన్ స్టూడెంట్స్‌. డొనేషన్ కట్టి విమ్స్ అనే కాలేజీలో జాయిన్ అవుతారు. అడవి మధ్యలో వారి కాలేజీ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ హాస్టల్ కోసం చాలా ఏళ్లుగా మూతపడిన ఓ బిల్డింగ్‌ను కేటాయిస్తారు. ఆ బిల్డింగ్‌ను ఓపెన్ చేయద్దని, విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదమని ఆనంద్ అనే అతడు ఎంత చెప్పిన కాలేజీ యాజమాన్యం మాత్రం పట్టించుకోదు. హాస్టల్ ప్రాంగణంలోకి ఎట్టిపరిస్థితుల్లో ఆడమనిషి అడుగుపెట్టకూడదని, రూమ్ నంబర్ 418 గది తలుపులు ఎవరూ తెరవకూడదని విద్యార్థులకు హాస్టల్ వార్డెన్ కండీషన్ పెడతాడు.

417 రూమ్‌లో ఉన్న వివేక్‌ను చంపేందుకు ఓ అత్మ ప్రయత్నిస్తుంది. ఆ ప్రమాదం నుంచి బయటపడిన వివేక్‌ 418 రూమ్ వెనకున్న మిస్టరీని తెలుసుకోవడం మొదలుపెడతాడు. అతడి అన్వేషణలో ఆ రూమ్ గురించి ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? ఆ రూమ్‌కు దేవిక (చైత్ర జే ఆచార్‌) అనే యక్షగాన కళాకారిణికి ఉన్న సంబంధమేమిటి? ఆమె ఎందుకు ఆత్మగా మారి హాస్టల్‌లోకి అడుగుపెట్టిన అమ్మాయిలను చంపుతుంటుంది? సయేషా (ప్రీతి పగడాల) ఎవరు? హాస్టల్‌లోకి అడుగుపెట్టిన ఆమెను దేవిక బారి నుంచి రోహిత్‌, వికాస్ కాపాడారా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.

నటీనటుల పనితీరు: యాక్టింగ్ పరంగా ఈ సినిమాకు చైత్ర జే ఆచార్ హైలైట్‌గా నిలిచింది. పుట్టబోయే బిడ్డకోసం ఏం చేయడానికైనా సిద్ధపడే మహిళగా తన విలనిజంతో భయపెట్టింది. అదే స్థాయిలో ఎమోషన్స్‌ను పండించింది. వివేక్‌గా సూర్యరాజ్, రోహిత్ క్యారెక్టర్‌కు చరణ్ లక్కరాజు న్యాయం చేశారు. వీరిద్దరి పాత్రల చుట్టూనే 418 మూవీ సాగుతుంది. మోడ్రన్ అమ్మాయిగా ప్రీతి పగడాల నటన ఒకే. శశాంక్ పాటిల్‌, శ్రీవైష్ణవ్ కామెడీ అంతగా వర్కవుట్ కాలేదు.రమేష్ ఇందిర, గోపరాజు విజయ్‌, కోట జయరామ్‌తో పాటు మిగిలిన తమ పరిధుల మేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు: ఓ పాడుబడిన బంగళాలో ఆత్మ ఉండటం…ఆ బంగళాలోకి అడుగుపెట్టిన హీరోహీరోయిన్లను చంపాలని అనుకోవడం… దానికో ఫ్లాష్‌బ్యాక్‌…చాలా వరకు హారర్ సినిమాలు ఇవే కాన్సెప్ట్ చుట్టూ సాగుతుంటాయి. 418 కూడా ఇంచుమించే ఇదే కథ. ఈ రొటీన్ హారర్ ఫార్ములా కథను జెన్‌జీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా కొంచెం డిఫరెంట్‌గా చెప్పాడు డైరెక్టర్ కీర్తన్ నాదగౌడ .ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను చాలా వయలెంట్‌గా రాసుకున్నాడు. కన్నడ నేటివిటీ, సాంగ్స్ కూడా కొత్తగా అనిపిస్తాయి.

దర్శకుడి కథకు టెక్నికల్ టీమ్ ప్రాణం పోసింది. సౌండ్ డిజైనింగ్‌తో పాటు వెంకీ జీజీ బీజీఎమ్ భయపెట్టాయి. దినేష్ దివాకర్ తన సినిమాటోగ్రఫీతో హారర్ ఫీల్‌ను చివరి వరకు క్యారీ చేసింది. విజువల్స్‌, లోకేషన్స్ రెగ్యులర్ హారర్ సినిమాలకు భిన్నంగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ సినిమానే అయినా ఆ అనుభూతి ఎక్కడ కలగనీయకుండా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు జాగ్రత్తపడ్డారు.

విశ్లేషణ: ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్ ప్రజెంటర్ కావడం, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందడంతో చిన్న సినిమా 418 తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూవచ్చింది. దానికి తోడు సెన్సార్ నుంచి అడ్డంకులు ఎదురయ్యాయనే వార్తలు కూడా ఆ క్యూరియాసిటీని మరింత పెంచాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్లుగా 418 భయపెట్టలేకపోయింది.

టెక్నికల్‌గా సినిమా టాప్ నాచ్‌లో ఉంది. కథను మొదలుపెట్టిన తీరు ఆసక్తిని పంచుతుంది. కానీ పోనుపోను రొటీన్‌గా మారిపోయింది. కాలేజీ వాతావరణం, ఆ బిల్డింగ్‌లో ఏదో ఉందనే సస్పెన్స్‌తో ఫస్ట్ హాఫ్ మొత్త కథను బిల్డ్ చేయడానికే వాడుకున్నారు డైరెక్టర్‌. ఆరంభ సన్నివేశాలు, వివేక్‌, రోహిత్, సయేషా మధ్య ఫ్రెండ్‌షిప్‌ను చూపించే సీన్లు యూత్ ఆడియెన్స్ కోసమే సినిమాలో పెట్టినట్లుగా అనిపిస్తాయి.

వివేక్ పాత్ర ద్వారా ఆ బిల్డింగ్‌కు సంబంధించిన ఒక్కో ట్విస్ట్ రివీల్ చేస్తూ వెళ్లారు. సెకండాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ఇంట్రెస్టింగ్ రాసుకున్నారు డైరెక్టర్‌. క్లైమాక్స్‌లో దేవిక, సయేషా పాత్రలకు మధ్య ఉన్న రిలేషన్‌కు సంబంధించి రివీలయ్యే మలుపు బాగుంది. ఆత్మ ఎందుకోసం పోరాడిందో చివరకు దానినే కోల్పోవాల్సిరావడం అనే పాయింట్‌తో క్లైమాక్స్ వెరైటీగానే అనిపిస్తుంది. హారర్ స్టోరీకి యక్షగానం అనే ఆర్ట్‌ఫామ్‌ను జోడించారు. కానీ దానిని సరిగ్గా వాడుకోలేదు.

పేరున్న హీరోహీరోయిన్లు లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. రన్‌టైమ్ కూడా ఎక్కువే అనిపిస్తుంది. రెండు గంటల లోపే సినిమాను ఎండ్ చేస్తే బాగుండేది.

ఫోకస్ పాయింట్‌: 418 టైటిల్‌కు తగ్గట్లే వెరైటీ హారర్ మూవీ. కొత్తదనం కోరుకునే ఆడియెన్స్‌కు కొంత వరకు నచ్చుతుంది

రేటింగ్: 2.5/5

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu