Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ బడా నిర్మాత ఇంట్లో చాలా రొమాన్స్ జరిగిందట..!

ఆ బడా నిర్మాత ఇంట్లో చాలా రొమాన్స్ జరిగిందట..!

FilmyFocus 5 years ago

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు అనేవి పెద్ద విచిత్రమైనవి ఏమీ కావు. చాలా అంటే.. చాలా సాధారణమైన విషయం.ఏదో ఒక సందర్భంలో హీరో హీరోయిన్లు లేదా ప్రముఖ నటులు కలుసుకోవడం.. వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారడం.. వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ప్రేమలు ఎన్నాళ్ళు కొనసాగుతాయి.. పెళ్లి పీటలు ఎక్కుతాయా.. లేక బ్రేకప్ పేరుతో విడిపోతాయి అంటే కచ్చితంగా చెప్పలేము.బాలీవుడ్లో అయితే ఇలాంటి న్యూస్ లను కూడా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు.

అయితే ఓ జంట మాత్రం పై మాత్రం కొద్దిరోజులుగా ప్రేమ వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. ఇవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆ జంట మరేదో కాదు.. కత్రీనా కైఫ్- విక్కీ కౌశల్.

వీళ్ళిద్దరూ ఇటీవల ఓ మిడ్ నైట్ పార్టీలో తెగ రచ్చ చేశారట. వీరి ప్రేమాయణం కెమెరా కంటికి చిక్కినట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల బడా నిర్మాత కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన ఓ పార్టీకి విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ హాజరయ్యారట. పార్టీ మొత్తం వీళ్ళ రొమాన్స్ ఓ రేంజ్లో సాగిందట.

అటు తరువాత ఎవరి కార్లలో వారు ఎక్కి వెళ్లిపోయారట. ఇప్పటి వరకూ వీరి మధ్య వస్తున్న వార్తలు వట్టి గాసిప్స్ అనే అనుకున్నారు నెటిజన్లు. అయితే అంతకు మించి ఉందని.. ఈ మిడ్ నైట్ పార్టీతో స్పష్టమయినట్టు బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. విక్కీ కౌశల్ వయసు 32ఏళ్ళు కాగా, కత్రినా కైఫ్ వయసు 37ఏళ్ళు కావడం గమనార్హం.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu