Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Allu Arjun: 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

FilmyFocus 1 week ago

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతోకాలంగా ఓ భారీ పౌరాణిక చిత్రం చేయాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో హీరోగా ఎన్టీఆర్ నటించనున్నట్లు ప్రకటించడంతో గత కొంతకాలంగా కొనసాగుతున్న అనేక ఊహాగానాలకు ఎండ్ కార్డు పడింది. ముఖ్యంగా ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్(Allu Arjun) నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి.

Allu Arjun

అయితే కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్‌పై పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎన్టీఆర్‌ను పక్కన పెట్టి అల్లు అర్జున్‌తో సినిమా తెరకెక్కనుందనే వార్తలు అభిమాన వర్గాల మధ్య అనేక చర్చలకు దారి తీశాయి. దీనితో తాజాగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ అధికారికంగా ప్రకటించబడటంతో అసలు కథ ఏంటన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. సమాచారం ప్రకారం.. ఈ పౌరాణిక కథను త్రివిక్రమ్ ప్రారంభం నుంచే ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసినట్లు సమాచారం.

సినిమా కథ ప్రధాన పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే పూర్తి స్థాయిలో న్యాయం చేయగలరనే అభిప్రాయంతో ఆయన ముందుకు వెళ్లినట్లు సమాచారం. అందుకే మొదటి రోజు నుంచే ఈ ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్ పేరు పరిశీలనలో ఉండేది. అయితే గత ఏడాది ఓ సమయంలో అల్లు అర్జున్ స్వయంగా త్రివిక్రమ్‌ను కలిసి ఈ పౌరాణిక చిత్రాన్ని తనతో చేయాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరిగింది. ఆ సమయంలో అల్లు అర్జున్ చేతిలో అట్లీ సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ లేకపోవడంతో ఈ ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. అయితే త్రివిక్రమ్ వెంటనే ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా వేచి ఉన్నారు.

ఈ పరిణామాల గురించి ఎన్టీఆర్‌కు కూడా సమాచారం ఉన్నపటికీ.. ఆయన ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పరిస్థితులు మారిపోయాయి. దీంతో త్రివిక్రమ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కు సరైన సమయం కోసం ఎదురుచూసి, చివరకు ఎన్టీఆర్ హీరోగా చిత్రాన్ని ప్రకటించినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ చాలా కాలంగా కథ, స్క్రీన్‌ప్లే అంశాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినట్లు సమాచారం.

ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్ వచ్చారనే ప్రచారాల కంటే.. మొదటి నుంచే ఎన్టీఆర్ ఈ కథకు ప్రధాన ఎంపికగా ఉన్నారనే విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది. అధికారిక ప్రకటనతో అన్ని ఊహాగానాలకు ముగింపు దొరికింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu