Thursday, 15 Apr, 3.24 am FilmyFocus

హోమ్
అనసూయ బోల్డ్ కామెంట్స్ వైరల్..!

అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు. తన గ్లామర్ తో కుర్రకారుని సైతం తన వైపుకి తిప్పుకునే ట్యాలెంట్ కలిగిన యాంకర్. ఇద్దరు పిల్లలకు తల్లైనప్పటికీ కూడా హీరోయిన్లను సైతం డామినేట్ చేసే ఫిగర్ ఈమె సొంతం. బుల్లితెర పై ఎంత గ్లామర్ వలకబోసినా సినిమాల్లో చేసేప్పుడు మాత్రం కథా ప్రాధాన్యత కలిగిన పాత్రలనే పోషిస్తూ ఉంటుంది. 'క్షణం' 'రంగస్థలం' 'యాత్ర' వంటి సినిమాల్లో మంచి నటన కనపరిచి ఈమె అభిమానులతో పాటు ప్రేక్షకులందరినీ అలరించింది.

ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ తో పాటు సామాజిక అంశాల పై కూడా స్పందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా… తన అభిమానులతో కూడా అప్పుడప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇటీవల కూడా అలాగే ఆమె అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్…' మీరు తాగుతారా అని ప్రశ్నించాడు '. ఈ ప్రశ్నకు అనసూయ ఏమాత్రం తడుముకోకుండా ' అవును ' అంటూ సమాధానం ఇచ్చింది.

అంతేకాదు ' రాత్రి 2 గంటల వరకూ కూడా తాగుతాను. దాని వల్ల బుక్కైయ్యేది మా ఆయనే ' అంటూ సమాధానం ఇచ్చింది. గతంలో గ్లామర్ కోసం వైన్ తాగుతాను అంటూ తెలిపిన అనసూయ ఈసారి మాత్రం ఓపెన్ అయిపోయింది.

'వకీల్ సాబ్ ' నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu
Top