Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anirudh - Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే. ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Anirudh - Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే. ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

FilmyFocus 6 days ago

సౌత్‌ సినిమాలో ఇంకా చెప్పాలంటే ఇండియన్‌ సినిమాలో.. ఇప్పుడు ఇద్దరు యంగ్‌ గన్స్‌ లాంటి మ్యూజిక్‌ డైరక్టర్ల మధ్య కనిపించని, ఆసక్తికర పోరు నడుస్తోంది.

ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్‌ - తమన్‌ మధ్య జరిగిన మ్యూజికల్‌ వార్‌ కంటే పెద్ద వార్‌ నడుస్తోంది. ఈ వార్‌లో హీరోలు అనిరుథ్‌ రవిచందన్‌, సాయి అభ్యంకర్‌. ఈ ఇద్దరి చేతిలో ఇప్పుడు చెరో పది సినిమాలు ఉన్నాయి తెలుసా. అందులో దాదాపు అన్నీ స్టార్‌ హీరోల పెద్ద సినిమాలే కావడం గమనార్హం.

Anirudh – Sai Abhyankar

ఇద్దరూ ఏ సినిమాలు చేస్తున్నారు అనేది చూస్తే.. రెండు స్ట్రాంగ్‌ టీమ్‌లు ఫైనల్‌ పోరులో తలపడుతున్నట్లుగా ఉంది వారి సినిమాల లిస్ట్‌. ఏంటా సినిమాలు అనేది అందరికీ తెలుసు. అందుకే కొత్తగా వారు సంగీతం అందిస్తున్న సినిమాల హీరోలు ఎవరో చూస్తే.. టీమ్‌ భలేగుంది అనిపిస్తుంది.

కొత్త కుర్రాడు సాయి అభ్యంకర్‌ హీరోలు వీరే…
* సూర్య
* ధనుష్‌
* అల్లు అర్జున్‌
* కార్తి
* రాఘవ లారెన్స్‌
* ధ్రువ్‌ విక్రమ్‌
* శింబు
* ప్రదీప్‌ రంగనాథన్‌ - మమితా బైజు
* విజయ్‌ సేతుపతి

పాత కుర్రాడు అనిరుథ్‌ కథానాయకులు వీరే..
* విజయ్‌
* రజనీకాంత్‌
* అల్లు అర్జున్‌
* షారుఖ్‌ ఖాన్‌
* లోకేశ్‌ కనగరాజ్‌
* యశ్‌
* శింబు
* నాని
* కార్తి

ఇప్పుడు చెప్పండి పైన మేం ఇచ్చిన ఎలివేషన్లు ఏమాత్రం తక్కువ కావు కదా. ఇంత పెద్ద లిస్ట్‌ చూశాక ఎవరూ కావు అనే మాట అనే ధైర్యం చేయరులెండి. అయితే ఇక్కడ విషయం ఇద్దరిలో ఏ టీమ్‌ గెలుస్తుంది. ఎవరు మ్యాన్‌ ఆఫ్‌ ది టీమ్‌ అవుతారు అనేదే. సాయి అభ్యంకర్‌ ఇంకా కెరీర్‌ ప్రారంభంలోనే ఉన్నారు. అనిరుథ్‌ ఆల్‌రెడీ స్టార్‌ స్టేటస్‌ చూశారు. కాబట్టి ఈ మ్యాచ్‌ అప్‌ అదిరిపోయే కిక్‌ ఇవ్వడం ఖాయం.

మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu