Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

FilmyFocus 2 weeks ago

పెళ్లి - విడాకులు.. ఇంత సులభమా అనిపిస్తుంటుంది కొంతమంది వ్యవహారం చూస్తే. పెళ్లి చేసుకొని పట్టుమని ఆరు నెలలు తిరగకుండానే విడాకులకు సిద్ధమవుతున్నారు.

ఇప్పుడు ఇలాంటి పరిస్థితి బాలీవుడ్లో కనిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ సింగర్‌, పంజాబీ రాపర్‌ బాద్‌షా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. పంజాబీ నటి ఇషా రికీ, తాను విడిపోతున్నట్లు బాద్‌షా ప్రకటించారు. వీరికి ఐదు నెలల క్రితమే వివాహం జరిగిన విషయం తెలిసిందే.

Badshah

సోమవారం రాత్రి ఇటు బాద్‌షా, అటు రికీ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్లు ఇద్దరూ రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా బాద్‌షాకి ఇది రెండో విడాకులు. 2012లో జాస్మిన్ మసీను ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి 2017లో ఓ కూతరు పుట్టింది. అక్కడికి మూడేళ్లకు కొన్ని కారణాల వల్ల 2020లో విడిపోయారు. ఆ తర్వాత ఇషా రికీని ప్రేమ వివాహం చేసుకున్నారు.

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా త్వరలో రానున్న 'బిగ్ బాస్ 20' రియాల్టీ షోలో ఇషా పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సమయంలో విడాకులు ఏంటి అనే చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా బాద్‌షా, ఇషా మధ్య మనస్పర్థలు వచ్చాయట. అయితే వీరి మధ్య కుదిరిన ఒప్పందం, భరణం గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఎందుకంటే సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకులు చాలా కాస్ట్‌లీ. మనం చాలామంది విషయంలో చూశాం కూడా.

తెలుగులో ఓ స్టార్‌ హీరోయిన్‌ - స్టార్‌ హీరోల జంట విడాకుల విషయంలో ఇలా సాఫ్ట్‌గా కాకుండా నానా యాగీ చేసి ఆమె బయటకు వచ్చేసింది. ఆ తర్వాత కూడా తమ బంధం గురించి వీలు కుదిరినప్పుడల్లా విమర్శలు చేస్తూ వచ్చింది. మరోవైపు ఇంకో స్టార్‌ హీరోయిన్‌ ఇటీవల కుర్ర హీరోతో విడిపోతూ.. ఆయన మీద చాలా విమర్శలు చేసింది. అయితే ఆ కుర్ర హీరో ఆమెను ఏమీ లేదు. అన్నట్లు పైన చెప్పిన స్టార్‌ హీరో కూడా ఇప్పటివరకు విడాకుల విషయంలో బహిరంగంగా చర్చించింది లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu