Wednesday, 14 Apr, 11.38 pm FilmyFocus

హోమ్
Balkrishna: బాలయ్య మూవీ రిలీజ్ డేట్ మారనుందా..?

స్టార్ హీరో బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమా తొలి టీజర్ గతేడాది రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా నిన్న ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన రెండో టీజర్ రిలీజైంది. గత కొన్ని నెలల నుంచి బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుండగా బాలకృష్ణ ఈ టీజర్లో అఘోరా గెటప్ లో కనిపించడం గమనార్హం. యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో కూడా అఖండ టీజర్ ట్రెండ్ అవుతోంది.

అయితే సోషల్ మీడియాలో బాలయ్య టీజర్ డైలాగ్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది' అంటూ టీజర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్ ఏపీలో అధికార పార్టీ తరపున గెలిచిన మంత్రిని ఉద్దేశించి చెప్పిన డైలాగ్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అఖండ మూవీ ఫస్ట్ టీజర్ లో కూడా బాలకృష్ణ ఆ ఎమ్మెల్యేను ఉద్దేశించి డైలాగులు చెప్పిన సంగతి తెలిసిందే.

ఒకప్పుడు టీడీపీలో ఉన్న ఆ ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్లడంతో రంగు మార్చిన పంది అంటూ బాలయ్య డైలాగులు పేల్చారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలకృష్ణ తన టీజర్లలోని డైలాగుల ద్వారా ఏపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ లు ఇస్తుండటం గమనార్హం. మరోవైపు నిన్న విడుదలైన టీజర్ లో మే 28వ తేదీనే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నిన్న విడుదలైన టీజర్ లో రిలీజ్ డేట్ లేకపోవడంతో బాలయ్య బోయపాటి శ్రీను సినిమా రిలీజ్ డేట్ విషయంలో సందేహాలు తలెత్తుతున్నాయి.

'వకీల్ సాబ్ ' నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu
Top