Dailyhunt
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన 'బైకర్'

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన 'బైకర్'

FilmyFocus 2 weeks ago

రుస ఫ్లాపుల్లో ఉన్న శర్వానంద్… ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు 'బైకర్' గా( Biker ) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇండియాలో రూపొందిన ఫస్ట్ మోటో క్రాస్ మూవీ ఇది.

Biker

అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ తండ్రి పాత్ర పోషించడం విశేషం. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ‘బైకర్’. కొంతమంది బాగుంది అన్నారు.. ఇంకొంతమంది కొన్ని కంప్లయింట్స్ చెప్పారు. అందువల్ల బాక్సాఫీస్ వద్ద సొ సొ ఓపెనింగ్స్ నే రాబట్టింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే

తెలంగాణ0.94 cr
సీడెడ్0.09 cr
ఆంధ్ర(టోటల్) 0.36 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)1.39 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.49 cr
వరల్డ్ వైడ్ టోటల్1.88 cr(షేర్)

‘బైకర్’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.1.88 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ రూ.3.8 కోట్ల వరకు వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.19.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. చూడాలి మరి వీకెండ్ ను ఎలా క్యాష్ చేసుకుంటుందో..!

మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన 'రాకాస'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu