Dailyhunt
Biker First Review: 'బైకర్' మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: 'బైకర్' మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

FilmyFocus 2 weeks ago

ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు చార్మింగ్ స్టార్ శర్వానంద్. ఇప్పుడు 'బైకర్' (Biker) గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇండియాలో రూపొందుతోన్న మొట్ట మొదటి మోటోక్రాస్ మూవీ ఇది. సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ పై వంశీ కృష్ణారెడ్డి,ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు.

Biker Movie First Review

జిబ్రాన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 3న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రంగంలోకి దిగి ప్రమోషన్ చేయడం, అలాగే హీరో శర్వానంద్ ప్రమోషన్స్ లో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు గట్టిగానే ఏర్పడ్డాయి. ఆల్రెడీ నిర్మాతలు స్పెషల్ షో వేసి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి సినిమాని చూపించడం జరిగింది.

వారి టాక్ ప్రకారం… సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉంటుందట. సినిమా స్టార్టింగ్ లో వచ్చే బైక్ రేసులు వంటివి ఆకట్టుకుంటాయట. అవి ఆడియన్స్ ను వెంటనే కథలోకి తీసుకెళ్తాయట. ఈ క్రమంలో వచ్చే రాజశేఖర్ ఎపిసోడ్స్ , అలాగే శర్వానంద్ తో వచ్చే కాంబినేషన్ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. విజువల్స్ అన్నీ టాప్ నాచ్ లో ఉంటాయట. క్లిఫ్ జంప్ సీక్వెన్స్ గురించి గొప్పగా చెబుతున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. సెకండాఫ్ లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయట. అలాగే క్లైమాక్స్ లో వచ్చే రేసింగ్ సీక్వెన్స్ కూడా హైలెట్ అంటున్నారు. ఈ సినిమా సౌండింగ్ పరంగా ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.

సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu