లీక్‌లు ఎప్పుడైనా సినిమాకు చేటు చేస్తాయి.. కానీ కొన్ని లీక్‌లు సినిమా మీద హైప్‌ను అమాంతం పెంచుతాయి. అలాంటి లీక్‌లే 'చిరు లీక్స్'. అవును మెగాస్టార్ చిరంజీవి చేసే లీక్స్ అలా ఉంటాయి మరి.
సినిమా గురించి ఆయన ఏదైనా విషయం చెప్పారు అంటే.. అందులో ఆయనకు బాగా నచ్చింది, సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తుంది అనిపించే అంశాన్ని చెప్పేస్తుంటారు ఆయన. ఇప్పుడు అలా 'పెద్ది' సినిమా గురించి కూడా ఓ విషయం చెప్పేశారు. ఇప్పుడు ఆయన పోస్ట్ వైరల్ అవుతోంది.
Chiranjeevi
'పెద్ది' సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ మేరకు ఫైనల్ కట్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి ట్రైలర్‌ను చూపించారు. ఆ తర్వాత ఆయన రియాక్ట్ అవుతూ ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి 'పెద్ది' సినిమా ట్రైలర్ ఉంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాగే ఒక డైలాగ్‌ను కూడా లీక్ చేశారు. 'పెద్ది' సినిమా ట్రైలర్ చూశా. వావ్! మూడు నిమిషాలు.. ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని తనదైన శైలిలో హైప్ ఇచ్చారు.


