Dailyhunt
Dacoit: 'డెకాయిట్' బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: 'డెకాయిట్' బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

FilmyFocus 3 weeks ago

టాలీవుడ్ 'హిట్' మెషీన్ గా పేరు తెచ్చుకున్న హీరో అడివి శేష్ ఏప్రిల్ 10న 'డెకాయిట్'(Dacoit) గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.మృణాల్ ఠాకూర్ శేష్ కి జోడీగా నటిస్తుంది.

Dacoit

అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, సునీల్ వంటి చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది.

ఈ వీకెండ్ కి సినిమా లవర్స్ ఫస్ట్ ఛాయిస్ అంటే ‘డెకాయిట్’ అనే చెప్పొచ్చు.ట్రేడ్ లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం.. రిలీజ్‌కు ముందే ‘డెకాయిట్’ మేకర్స్ సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా టేబుల్ ప్రాఫిట్స్ లో ఉన్నట్టు వినికిడి. నిర్మాతలకి ఇది ప్రాఫిటబుల్ వెంచర్‌ అంటున్నారు. సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓటీటీ, శాటిలైట్, ధియేటర్ రైట్స్ వంటివి అవుట్ రైట్ గా సెల్ అయిపోయాయి అని తెలుస్తోంది. డబ్బింగ్ రైట్స్ ఇంకా మిగిలే ఉన్నాయి.

శేష్ కి హిందీలో కూడా ఫాలోయింగ్ ఎక్కువ. ‘క్షణం’ ‘మేజర్’ వంటి సినిమాలు అక్కడ బాగా ఆడాయి.కాబట్టి డబ్బింగ్ రైట్స్ రూపంలో కూడా మంచి రెవెన్యూ నిర్మాతలకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.బడ్జెట్, షూటింగ్ డేస్ కొంచెం పెరిగినా ప్రాపర్ ప్లానింగ్ తో సినిమాని కంప్లీట్ చేయడం, అడివి శేష్ మార్కెట్, ట్రాక్ రికార్డు కూడా బాగుండటం వంటి వాటివల్ల ‘డెకాయిట్’ తో నిర్మాతలు జాక్ పాట్ కొట్టారు అని చెప్పాలి. మరి బాక్సాఫీస్ వద్ద కూడా ఇదే జోరు చూపిస్తుందేమో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu