Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Deepika - Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika - Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

FilmyFocus 0 months ago

నిన్నమొన్నటివరకు ఇండియన్‌ సినిమాలో అందరూ మాట్లాడుకున్న హీరో రణ్‌వీర్‌ సింగ్‌. రెండు 'ధురంధర్‌' సినిమాల విజయాలతో ఆయన పేరు మార్మోగిపోయింది.

ఆ హడావుడి కాస్త సద్దుమణిగింది అనేసరికి.. ఇప్పుడు మరోసారి రణ్‌వీర్‌ పేరు చర్చలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఓ సినిమానే కారణం. అదే 'డాన్‌ 3'. ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది త్వరలో తేలుతుంది. అయితే ఇలాంటి పరిస్థితే గతంలో రణ్‌వీర్‌ భార్య (అప్పటికి కాదు) దీపికా పడుకొణె కూడా ఫేస్ చేసింది. ఇప్పుడు ఆ వివరాలు వైరల్‌గా మారాయి.

Deepika – Ranveer

'రేస్‌ 2' షూటింగ్‌ సమయంలో దీపికా పడుకొణె ప్రవర్తన విషయంలో నిర్మాత రమేశ్‌ తురానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆరు రోజుల షూటింగ్‌ జరిగిన తర్వాత ఆమె సినిమా నుండి వైదొలిగింది అని నిర్మాత ఆరోపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె డేట్స్‌కు అనుగుణంగా షూటింగ్ షెడ్యూల్స్ మార్చాల్సి వచ్చిందని, అయినా చివరి నిమిషంలో ప్రాజెక్ట్ నుండి వైదొలగడం వల్ల తమకు ఇబ్బందులు ఎదురయ్యాయని నిర్మాత చెప్పుకొచ్చారు.

అంతే కాదు సినిమా బృందం మీటింగ్‌లకు రాకపోవడం, ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడం లాంటివి కూడా దీపిక చేసిందని రమేశ్‌ చెప్పుకొచ్చారు. తన 25 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దాంతోపాటు దీపికపై సినీ సంఘాలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారాయన. దీంతో నిర్మాతలతో దీపిక చర్చలు జరిపి తిరిగి ప్రాజెక్ట్‌లోకి వచ్చింది. ఇలా ఇప్పుడు రణ్‌వీర్‌ వెనక్కి వచ్చే అవకాశం లేదని చెప్పొచ్చు.

ఇక రణ్‌వీర్‌ సింగ్‌ బ్యాన్‌పై 'ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌' (FWICE) చీఫ్‌ అడ్వైజర్‌ ఓ క్లారిటీ ఇచ్చారు. తాము రణ్‌వీర్‌పై బ్యాన్‌ విధించలేదని, అయితే 'డాన్‌ 3' సమస్యకు పరిష్కారం లభించే వరకూ ఆయనతో కలసి పని చేయొద్దని తమ ఫెడరేషన్‌ సభ్యులకు ఆదేశించామన్నారు.

నాగ చైతన్య 'వృషకర్మ' రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu