Dailyhunt
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

FilmyFocus 2 weeks ago

ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు విగ్నేష్ శివన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఎల్ ఐ కె'(LIK) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్లో జరిగింది. నయనతార కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవరిస్తున్నారు.

Dil Raju

తన ‘మన శంకర వరప్రసాద్ గారు’ హీరోయిన్ సినిమా కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడి గెస్ట్ గా వచ్చాడు. అలాగే ప్రదీప్ రంగనాథన్..ని ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దిల్ రాజు(Dil Raju) కూడా గెస్ట్ గా వచ్చారు.

ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అనిల్ రావిపూడిని హీరోగా లాంచ్ చేస్తానని దిల్ రాజు చెబితే.. ఆ ఆఫర్ ని అనిల్ రావిపూడి తిరస్కరించాడు.

అనిల్ స్పీచ్ ఇచ్చే టైమ్లో దిల్ రాజు మాట్లాడుతూ… ” మా వాడు(అనిల్ రావిపూడి) కూడా హీరోలా ఉన్నాడు కదా. హీరో మీనింగ్ యాక్టర్. అనిల్ నాకు ఎప్పుడు కథ చెప్పినా చెబుతుంటాను. నీలో మంచి నటుడు ఉన్నాడు అని. కథ చెబుతున్నప్పుడు ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రదీప్ ని సక్సెస్ ఫుల్ గా చూసావు కదా అనిల్. సక్సెస్ ఫుల్ గా నువ్వు హీరోలతో సినిమాలు తీస్తావు. అయిపోయాక నిన్ను నేనే హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తా” అంటూ చెప్పుకొచ్చాడు.

అందుకు అనిల్ రావిపూడి… ” దిల్ రాజు గారి ఇచ్చిన ఆఫర్ బాగుంది. కావాలంటే ఆయన నిర్మాణంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా పెట్టి ఓ సినిమాని డైరక్షన్ చేస్తాను. ఆయన ఆఫర్ ని అలా వాడుకుంటాను. నాకైతే ఇప్పట్లో ఆ ప్లాన్స్ లేవు” అంటూ దిల్ రాజు ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు అనిల్ రావిపూడి.

వీరిద్దరి కన్వర్జేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అనిల్ రావిపూడి ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతని పట్టిందల్లా బంగారం అవుతుంది. కానీ నిర్మాత దిల్ రాజు వరుస ఫ్లాప్స్ లో ఉన్నారు. అతని వద్ద ఇప్పుడు స్టార్ హీరోలు కూడా లేరు. డిస్ట్రిబ్యూషన్లో కూడా వీకైపోయారు అనే టాక్ నడుస్తుంది. అందుకే అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్ ను వాడుకోవాలని భావిస్తున్నారు. కానీ అనిల్ మాత్రం తన నెక్స్ట్ సినిమాని షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ లో చేస్తున్నాడు. ‘జీ’ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

దిల్ రాజుని గట్టెక్కించాలి అంటే అది అనిల్ రావిపూడి వల్లే అవుతుంది. అందుకే అతన్ని టార్గెట్ చేశాడు. హీరోగా లాంచ్ చేయడానికి కూడా రెడీ అయ్యాడు అని అర్దం చేసుకోవచ్చు. కానీ అనిల్ రావిపూడి మాత్రం దిల్ రాజు బుట్టలో పడలేదు అని అర్దం చేసుకోవచ్చు.

ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu