తారక్ గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు వచ్చినప్పుడు, ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు తరచూ వినిపించిన ప్రశ్న.. 'ఇదేంటి ఎన్టీఆర్ ఇలా అయిపోయాడు' అని.
బక్క చిక్కిపోయిన.. ముఖం పీక్కుపోయినట్లుగా ఉన్న తారక్‌ను చూసి కొంతమంది జెన్‌జీ కుర్రాళ్లు 'లుక్ కేక' అనుకోవచ్చు కానీ.. ఎన్టీఆర్ ఇన్నేళ్లుగా చూసినవారికి ఇబ్బందికరంగానే ఉంది. దానికి కారణం తారక్ లుక్ పీలగా ఉంది కాబట్టి. వాయిస్‌లో ఉన్న గాంభీర్యం లుక్‌లో లేదు అని అనేది వారి మాట.
Dragon
ఇప్పుడు 'డ్రాగన్' సినిమా గ్లింప్స్ వచ్చాక.. అదే చర్చ మళ్లీ మొదలైంది. సినిమాలో తారక్ లూగర్ అనే పాత్రలో కనిపిస్తాడని.. అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి అసాసిన్ ఇన్ చీఫ్‌గా ఆయన కనిపిస్తాడని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. తారక్ తన డైలాగ్‌లను తనదైన శైలిలో బేస్ వాయిస్‌తో 'వార్ 2' సినిమాలో చెప్పినట్లే చెప్పారు. అయితే వినిపించినంత బేస్ ఫేస్‌లో కనిపించడం లేదు అనేదే ఇక్క చర్చ. బక్క చిక్కిన ఎన్టీఆర్‌కు ఆ బియర్డ్ ఎబ్బెట్టుగా కనిపిస్తోంది అని చెప్పాలి. గతంలోనూ తారక్ ఇలా సన్నగా కనిపించినా ఆ గడ్డం అంత ఉండేది కాదు.


