Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న 'దృశ్యం 3'

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న 'దృశ్యం 3'

FilmyFocus 5 days ago

‘దృశ్యం’ సీక్వెల్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దృశ్యం’ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది.

తెలుగులో వెంకటేష్ హీరోగా ‘దృశ్యం’ ‘దృశ్యం 2’ సినిమాలు రూపొందాయి.

Drishyam 3 Collections

మొదటి భాగం సూపర్ హిట్ అయ్యింది. ‘దృశ్యం 2’ కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇండియా వైడ్ బాగా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ‘దృశ్యం 3′(Drishyam 3) కూడా రూపొందింది. అయితే ఈ సిరీస్లో వెంకటేష్ నటించలేదు. కారణాలు ఏంటో తెలీదు కానీ మోహన్ లాల్ నటించిన మలయాళ(ఒరిజినల్) వెర్షన్..నే తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు.

మొదటి రోజు ‘దృశ్యం 3’ కి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ సూపర్ హిట్ సీక్వెల్ కాబట్టి.. మొదటి నుండి హైప్ ను సొంతం చేసుకున్న సినిమా కాబట్టి..టాక్ తో సంబందం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించింది. వీక్ డేస్ లో డౌన్ అయినప్పటికీ.. స్టెడీగా 9వ రోజుతో బ్రేక్ ఈవెన్ సాధించింది.2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకుంది. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం2.30 cr
సీడెడ్0.33 cr
ఆంధ్ర(టోటల్) 1.59 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)4.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్)0.17 cr
వరల్డ్ వైడ్ టోటల్4.39 cr(షేర్)

‘దృశ్యం 3’ చిత్రం తెలుగు వెర్షన్ కి రూ.3.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 11 రోజులు పూర్తయ్యేసరికి రూ.4.39 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.7.90 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఆదివారం రోజు కూడా ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.ఇప్పటివరకు బయ్యర్స్ కి మొత్తంగా రూ.0.39 కోట్ల లాభాలు అందించింది.

'పెద్ది' తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu