Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన 'హైసన్‌బర్గ్‌'.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన 'హైసన్‌బర్గ్‌'.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

FilmyFocus 6 days ago

నిరుధ్‌ స్వరపరిచిన ఓ పాట రిలీజ్‌ అవుతోంది అంటే.. కచ్చితంగా వచ్చే చర్చ 'ఎవరీ హైసన్‌బర్గ్‌'. ఆయన సంగీతం అందించే సినిమాలో ఓ పాటను హైసన్‌బర్గ్‌ అనే రచయిత రాస్తుంటారు.

ఇంగ్లిష్‌ లిరిక్స్‌తో ఉండే పాట ఆటోమేటిగ్గా చార్ట్‌బస్టర్‌ అవుతూ ఉంటుంది. మీరు కూడా ఈ చర్చ గురించి వినే ఉంటారు. అయితే దీనికి కంక్లూజన్‌ మాత్రం ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు మరోసారి ఆ పేరు చర్చలోకి వచ్చింది. దానికి కారణం ఆయన సాహిత్యం అందించిన పాట బిట్‌ ఒకటి ఇప్పుడు వచ్చింది. అదే 'జైలర్‌ 2' థీమ్‌.

Heisenberg

'జైలర్‌ 2' సినిమాను రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తూ చిత్రబృందం ఓ పాట వీడియో విడుదల చేసింది. 'వన్‌ నేమ్‌' అంటూ సాగే ఆ పాటను హైసన్‌బర్గ్‌ రాశారు అని టీమ్‌ చెప్పింది. దీంతో మరోసారి హైసన్‌బర్గ్‌ ఎవరు అనే చర్చ మొదలైంది. ఆ వ్యక్తి ఎవరు? పాటలో పేరు ద్వారా కనిపించడమే తప్ప.. ఎక్కడా మనిషి కనిపించరు. పాట అంత హిట్‌ అయినా ఎందుకు మీడియా ముందుకు రారు. సినిమా ఈవెంట్లలో కూడా కనిపించరు అనే చర్చ మళ్లీ షురూ అయింది.

హైసన్‌ బర్గ్‌ ఇప్పటివరకు 'లియో', 'దేవర 1', 'వేట్టయాన్‌', 'కూలీ', 'ఎల్‌ఐకే' సినిమాలో పాటలు రాశారు. అన్నీ బ్లాక్‌బస్టరే. ఇప్పుడు 'జైలర్‌ 2'లో కూడా ఓ పూర్తి పాట రాశారట. ఎక్కువగా లోకేశ్‌ కనగరాజ్‌ - అనిరుథ్‌, నెల్సన్‌ - అనిరుథ్‌ కాంబోలోని సినిమాల్లో ఆయన పాటలు రాస్తుంటారు. అయితే ఆయన అసలు పేరు అది కాదని లోకేశ్‌ ఓ సారి చెప్పారు. మరెవరు అంటే మాత్రం చెప్పలేదు.

అయితే, తమిళ సోషల్‌ మీడియాలో హైసన్‌ బర్గ్‌ అంటే అనిరుథ్‌ ఘోస్ట్‌ నేమ్‌ అని అంటున్నారు. మరికొందరు లోకేశ్‌ కానీ, నెల్సన్‌కానీ అని చెబుతున్నారు. ఇంకొందరు అయితే వీరంతా కాదు శివకార్తికేయన్‌ అని అంటున్నారు. వీటిలో ఏది నిజమో హైసన్‌బర్గ్‌ ముందుకొచ్చి చెబితే కానీ తెలియదు. అన్నట్లు పైన చెప్పిన అందరూ హైసన్‌ బర్గ్‌ను చూడలేదని, ఫోన్‌లోనే మాట్లాడమని చెబుతుండటం గమనార్హం.

విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu