Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన బాలా డెసిషన్..!

ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన బాలా డెసిషన్..!

FilmyFocus 5 years ago

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణకు సరైన కథ పడాలే కానీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి పడేస్తాడు. బాలయ్య సినిమా వస్తుందంటే బిసి సెంటర్స్ ఆడియన్స్‌కు జాతరే అని చెప్పాలి. లుంగీలు, పంచలతోనే తొలి ఆట చూసేందుకు రెడీ అయిపోతారు. వెండితెర పై బాలకృష్ణ డైలాగులు చెబుతుంటే ఊరమాస్ ఫ్యాన్స్ థియేటర్‌లో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు. మాస్ పీపుల్స్‌లో ఈ నటసింహానికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. ఇక ప్రస్తుతం బోయపాటి శీను డైరెక్షన్‌లో హ్యాట్రిక్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫైనల్ కాస్ట్‌ను సెట్ చేసుకునే పనిలో ఉన్న బోయపాటి బాలయ్యను మరోసారి ఎలా ప్రెజెంట్ చేస్తాడని నందమూరి అభిమానులు వెయిటింగ్‌లో ఉన్నారు.

వచ్చే ఏడాది సమ్మర్‌కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలు సింహా, లెజెండ్‌లు సూపర్ హిట్‌లు అవడంతో ఆ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా బాలయ్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దర్శకుల గత ట్రాక్ రికార్డ్స్‌ను పట్టించుకోని బాలకృష్ణ మరోసారి ప్లాప్ డైరెక్టర్‌కు చాన్స్ ఇస్తున్నాడట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. టాప్ డైరెక్టర్ల విషయం పక్కన పెడితే మీడియం రేంజ్ దర్శకులు ఒకసారి ప్లాప్ ఇచ్చారంటే వారికి మరో చాన్స్ ఇవ్వరు మన హీరోలు. అయతే బాలా రూటు మాత్రం సపరేటుగా ఉంటుంది.

ఈ క్రమంలో తనకు డిక్టేటర్‌తో బిలో యావరేజ్ సినిమా ఇచ్చిన శ్రీవాస్‌కు మరో చాన్స్ ఇవ్వాలని డిసైట్ అయ్యాడట ఈ నందమూరి హీరో. ఇటీవల శ్రీవాస్ బాలయ్యకు ఓ పవర్‌ఫుల్ స్టోరీ లైన్ వినపించాడట. ఆ పాయింట్ నచ్చడంతో ఆ డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ పట్టించుకోకుండా వెంటనే తనతో సినిమా చేస్తానని మాట ఇచ్చి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట. దీంతో సాక్ష్యం ప్లాప్‌తో ఢీలా పడ్డ శ్రీవాస్ బాలా ఇచ్చిన సపోర్ట్‌తో స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడట. దీంతో బాలయ్య డెసిషన్ ఇండస్ట్రీ వర్గాలకు షాకింగ్‌గా అనిపించినా, ఆయన మేకర్స్ పై ఉంచే నమ్మకానికి అభినందించాల్సిందే.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu