Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

FilmyFocus 3 days ago

విజయ్‌ సేతుపతి - సాయి పల్లవి జంటగా మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం 'ఇంజి వెల్లం'.. తెలుగులో దీన్ని 'అల్లం బెల్లం' అని అంటారు.

ఆ పేరును తెలుగు వెర్షన్‌కి పెడతారో లేదో తెలియదు. ఆ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు అసలు విషయానికొస్తే ఈ సినిమాకు సంబంధించి రెండు విషయాలు బయటకు వచ్చాయి. ఒకటి ఈ సినిమా షూటింగ్‌ చివరి షెడ్యూల్‌ షూటింగ్ ఇటీవల చెన్నైలో స్టార్ట్ అయిందట. పశ్చిమ బెంగాల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాక ఇక్కడకు వచ్చారనే విషయం తెలిసిందే.

Inji Vellam

ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ షెడ్యూలే సినిమా షూటింగ్‌లో ఆఖరిదట. ఇంకేదైనా ప్యాచ్‌ వర్క్‌ ఉంటే తప్ప.. సినిమా టీమ్‌కు ఇక కెమెరాతో పని లేదట. ఇక రెండో విషయం చూస్తే.. ఈ సినిమా వచ్చే జనవరిలో రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబరులోనే ప్రచారం షురూ చేయాలని భావిస్తున్నారట. అయితే సినిమా ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు.

తమిళంలో ఇప్పుడు సెట్స్‌ మీద ఉన్న సినిమాల్లో రజనీకాంత్‌ 'ధర్మన్‌' సంక్రాంతి బరిలో ఉంది అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో మణిరత్నం జనవరి ముహూర్తం పెట్టారు అని అంటున్నారు. అయితే అది సంక్రాంతా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సంక్రాంతికి అంటే.. చాలా సినిమాల మధ్యలో ఈ సినిమా వచ్చి చేరుతుంది.

శ్రీవిష్ణు - రామ్‌ అబ్బరాజు. ఈ కాంబినేషన్‌లో ఇటీవల అనౌన్స్‌ అయిన 'ఫ్యామిలీ ప్యాక్‌' సినిమాను పెద్ద పండగకి తీసుకొస్తామని మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించేసింది. చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'కాకా'. ఈ సినిమాను జనవరి 13న రిలీజ్‌ చేస్తామని టీమ్‌ ఇటీవల ఓ వీడియోతో అనౌన్స్‌ చేసింది. శర్వానంద్‌ - శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'జార్జ్‌ క్రిష్‌'. ఈ సినిమా ఓపెనింగ్‌ రోజే జనవరి 14 అని డేట్‌ చెప్పేశారు.

చాలా నెలలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా 'సంబరాల యేటి గట్టు'ను జనవరి 12న తీసుకొస్తాం అని రీసెంట్‌గానే చెప్పారు. వెంకటేశ్‌ - కల్యాణ్‌ రామ్‌తో అనిల్‌ రావిపూడి తీస్తున్న సినిమా 'జనవరి 12 విడుదల'. ఈ సినిమాను జనవరి 12నే విడుదల చేస్తారు. ఆ మేరకు అనిల్‌ లాక్‌ చేశారు. మరోవైపు దిల్‌ రాజు కూడా పొంగల్‌ ఫైట్‌కి రెడీ అయిపోయారు. రవితేజ - శ్రీవిష్ణుతో హసిత్ గోలి ఓ సినిమా చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానుందీ సినిమా.

మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu