Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

FilmyFocus 1 week ago

వితేజ, దర్శకుడు శివ నిర్వాణ కలయికలో రూపొందిన 'ఇరుముడి' (Irumudi) సినిమా ఇటీవల (ఆగస్టు 21న) విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలై వారం రోజులు దాటినప్పటికీ..

ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. తండ్రీ కూతుర్ల మధ్య ఉన్న భావోద్వేగాల ముడిని.. ఇరుముడికి లింక్ పెడుతూ దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని ఎంగేజింగ్ గా తెరకెక్కించాడు. క్లైమాక్స్ కి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకునే రేంజ్లో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. రవితేజ కెరీర్ లో ఇప్పటికే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఇరుముడి.. రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టి.. సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

Irumudi Movie

అయితే ఈ ఇరుముడి సినిమాకి రవితేజ ఫస్ట్ ఆప్షన్ కాదట. మీరు చదువుతున్నది నిజమే. దర్శకుడు శివ నిర్వాణ ఈ కథని ముందుగా నాగ చైతన్య ఆ తర్వాత గోపీచంద్..లకు వినిపించాడట. కానీ ఆ హీరోలు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల.. ఇరుముడి కథను వదులుకున్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్య సంగతి పక్కన పెడితే.. గోపీచంద్ కి కూడా ఈ కథ బాగా సెట్ అయ్యేది. అతని బాడీ లాంగ్వేజ్ కి, మాస్ అండ్ యాక్షన్ ఇమేజ్ కి ఇరుముడి కథ మంచి ఆప్షన్ అనే చెప్పాలి. పైగా అతను కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి.. ఇరుముడి మంచి బ్రేక్ ఇచ్చేదేమో. ఇలాంటి మంచి కథని వదులుకోవడం అనేది నిజంగా గోపీచంద్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి.

అలా అని రవితేజకి ఇరుముడి (Irumudi) కథ వెళ్ళడం జస్ట్ లక్ అని సరిపెట్టడం కరెక్ట్ కాదు. ఈ సినిమా కోసం రవితేజ ఎంత చేయాలో అంతా చేశాడు. స్వతహాగా రవితేజ దేవుణ్ణి నమ్మే మనిషి కాదు.అయినప్పటికీ అయ్యప్ప స్వామి భక్తుడిగా బాగా సెట్ అయ్యాడు. కూతురి ప్రేమ కోసం తపించే తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. రవితేజ మాస్ ఇమేజ్ కి.. ఫస్ట్ సీన్ నుండీ లాస్ట్ సీన్ వరకు లుంగీతో కనిపించడం అనే అంశం కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది.

ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu