Dailyhunt
కేరళ ఆలోచనను వదలని సుకుమార్‌.. ఎందుకో

కేరళ ఆలోచనను వదలని సుకుమార్‌.. ఎందుకో

FilmyFocus 5 years ago

'పుష్ప' సినిమా మొదలైనప్పటి నుంచి కేరళ షెడ్యూల్‌ అనే మాట వినిపిస్తూనే ఉంది. అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుండేసరికి… కేరళ వెళ్లకతప్పదు అని చెబుతూ వచ్చింది చిత్రబృందం. కరోనా కేసుల ఉద్ధృతి కారణంగా ఆ ఆలోచనను వాయిదా వేశారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత మారేడుమిల్లిలో షూటింగ్‌ చేశారు. దీంతో కేరళ షెడ్యూల్‌ లేనట్లే అనుకున్నారంతా… అయితే కేరళ షెడ్యూల్‌ ఇంకా చిత్రబృందం ఆలోచనల్లో ఉందట. త్వరలో కేరళ వెళ్లేలా చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోందట.

'పుష్ఫ'రాజ్‌ వచ్చే నెల ఐదు వరకు మారేడుమిల్లిలో ఉంటాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో చిత్రీకరణ స్టార్ట్‌ చేస్తారట. దీని కోసం ఇప్పటికే భాగ్యనగరంలో ప్రత్యేకంగా కొన్ని సెట్స్‌ వేశారట.

అక్కడ ఓ పది రోజుల షెడ్యూల్‌ ఉంటుందట. ఆ తర్వాత కేరళ వెళ్లాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోందట. సినిమా నేపథ్యాన్ని కేరళ అడవుల్లో చిత్రీకరణ తప్పదని సుకుమార్‌ భావిస్తున్నాడట. నిజానికి కేరళలోనే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ చేయాలనే ఆలోచనతోనే సుకుమార్‌ అండ్‌ టీమ్‌ 2019 ఆఖరులో అక్కడ టెస్ట్‌ షూట్‌ చేసిన విషయం తెలిసిందే.

మారేడుమిల్లి అడవిలో సినిమా మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ చేసేస్తారు అని తొలుత వార్తలొచ్చినా… ఇప్పుడు మళ్లీ కేరళ వెళ్లడానికి చిత్రబృందం ఎందుకు ఆసక్తి చూపిస్తోందో తెలియడం లేదు. అక్కడి అడవులు షూటింగ్‌కి అనువుగా ఉండటం.. దీనికి ఓకారణమట. సినిమా గ్రాండియర్‌ లుక్‌కి ఆ అడవులు అయితే బాగుంటాయని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైతేముంది చక్కగా మంచి సినిమా తీయాలి… మనం చూసి ఎంజాయ్‌ చేయాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu