Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

FilmyFocus 1 week ago

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej).. ఓ హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ .. గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా వంటి సినిమాలు చేశాడు.

అన్నీ ఫ్లాప్ అయ్యాయి. మధ్యలో ఎఫ్ 3 ఆడినా .. దాని క్రెడిట్ అంతా వెంకటేష్, అనిల్ రావిపూడి..లకి వెళ్ళిపోయింది. సో వరుణ్ తేజ్ కి ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ పడాలి. అప్పుడే మళ్ళీ అతని మార్కెట్ స్థిరపడుతుంది. ఇప్పుడు వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) పైనే ఉన్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన హారర్ సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు.

Korean Kanakaraju First Review

టీజర్ , ట్రైలర్ బాగానే ఉన్నాయి. చాలా కాలం తర్వాత వరుణ్ తేజ్.. కమర్షియల్ మీటర్ లో చేసిన సినిమా ఇది. అందువల్ల పాజిటివ్ వాతావరణం నెలకొంది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకి చూపించారు మేకర్స్ సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాల నిడివి కలిగి ఉందట. కొరియాలో సినిమా స్టార్ట్ అవుతుందట. అటు తర్వాత అనంతపురం, పెనుగొండలోకి షిఫ్ట్ అవుతుంది అంటున్నారు. కనకరాజుగా వరుణ్ తేజ్ తన మార్క్ కామెడీ టైమింగ్ తో అలరిస్తాడని అంటున్నారు.

సత్య కామెడీ కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. కొరియా ఆత్మ.. కనకరాజుని ఎలా ఆవహించింది? ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? అసలు కనకరాజు కొరియా ఎందుకు వెళ్ళాడు? వంటి అంశాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయంటున్నారు. రితికా నాయక్ (Ritika Nayak) రోల్ కూడా కథలో కీలకమని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయని కూడా సినిమా చూసిన వారు చెబుతున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో?

గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu