Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

FilmyFocus 6 days ago

సూర్య ఫ్యాన్స్‌ ఎవరినైనా నిద్రలో లేపి కూర్చోబెట్టి 'సూర్యను ఏ పాత్రలో చూడాలని అనుకుంటున్నావు' అని అడిగితే.. ఒక్క సెకన్‌ కూడా ఆలోచించకుండా చెప్పే సినిమా పేరు 'రోలెక్స్‌'.

కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' సినిమాకి వెళ్లిన ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. 'రోలెక్స్‌' అనే పాత్రతో సూర్యను తీసుకొచ్చి సినిమాకు ఓ హై ఇచ్చాడు. అంతేకాదు ఆ పాత్ర నేపథ్యంలో ఓ సినిమా కూడా ఉంటుంది అని 'విక్రమ్‌' టైమ్‌లో చెప్పుకొచ్చారు. అందుకే ఆ పాత్ర అంటే ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు అంత ఇష్టం.

Rolex

'విక్రమ్‌' సినిమా తర్వాత వచ్చిన హైప్‌తో ఈ సినిమా గురించి వెయిట్‌ చేస్తుండగా 'కూలీ' అనే సినిమా తీసి ఇబ్బందుల్లో పడ్డారు లోకేశ్‌. ఆ సినిమాకు వసూళ్లు వచ్చినా పేరు అయితే రాలేదు. అయితే ఇప్పుడు హీరోగా 'డీసీ' అనే సినిమా చేశారు. త్వరలో రిలీజ్‌ చేస్తారు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో ఓ సినిమా ఉంటుంది. ఇలా కొన్నేళ్ల వరకు ఆయన బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో 'రోలెక్స్‌' పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే ప్రశ్న సూర్య దగ్గరకు వెళ్లింది. దానికి ఆయన బంతి లోకేశ్‌ కోర్టులోనే ఉందని చెప్పేశారు.

లోకేశ్‌ ఏం చేయాలని అనుకుంటున్నారో తెలియదు. ఇప్పుడు ఆయన అల్లు అర్జున్‌ సినిమా, 'విక్రమ్‌ 2' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ 'రోలెక్స్‌' గురించి మాట్లాడుతూ ఉంటారు. కథ రాస్తున్నానని చెబుతుంటారు. కాబట్టి ఏమవుతుందో లోకేశ్‌కే తెలియాలి అని చెప్పేశారు. ఇదంతా చెప్పిన సూర్య.. తన తమ్ముడితో లోకేశ్‌ చేయాల్సి 'ఖైదీ 2' సినిమా గురించి అయితే చెప్పలేదు. దీంతో ఆ సినిమా ఉందా లేదా అనే డౌట్‌ మళ్లీ మొదలైంది.

'రోలెక్స్‌' సినిమాలో సూర్య, జ్యోతిక కలసి నటిస్తే బాగుంటుంది అనే చర్చ కూడా మరోవైపు మొదలైంది. దీని గురించి జ్యోతికను అడిగితే.. నాకు కూడా ఇదే లక్ష్యం ఉంది అని చెప్పారు. మరి లోకేశ్‌ కనగరాజ్‌ మనసులో ఏముందో తెలియాలి.

మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న 'శ్రీనివాస మంగాపురం'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu