Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాస్ హీరోకి విలన్ గా మారిన యాక్షన్ కింగ్!

మాస్ హీరోకి విలన్ గా మారిన యాక్షన్ కింగ్!

FilmyFocus 5 years ago

సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో క్యారెక్టర్ ని అంత బాగా ఎలివేట్ చేయొచ్చు. ఈ విషయం అర్ధం చేసుకున్న దర్శకులు విలన్ పాత్రల కోసం మంచి స్టేచర్ ఉన్న ఆర్టిస్ట్ లను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మాస్ రాజా రవితేజ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ 'ఖిలాడి' అనే సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ని తీసుకున్నట్లు సమాచారం. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన అర్జున్.. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఈ మధ్యకాలంలో విలన్ గా కూడా నటిస్తున్నారు. విశాల్ నటించిన 'అభిమన్యుడు' అలానే నితిన్ నటించిన 'లై' సినిమాల్లో విలన్ గా నటించాడు అర్జున్.

ఇప్పుడు 'ఖిలాడి' సినిమాలో కూడా విలన్ గా కనిపించడానికి సిద్ధమవుతున్నాడు అర్జున్. రవితేజ సినిమాలో అర్జున్ విలన్ అని తెలియడంతో ఈ కాంబినేషన్ పై ఆసక్తి నెలకొంది. సినిమాపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. 'ఖిలాడి' ఓ తమిళ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జారుతోంది. అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన 'శతురంగ వేట్టై-2' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే తమిళంలో ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.

కానీ సినిమా సబ్జెక్టు రమేష్ వర్మకి నచ్చడంతో రవితేజని హీరోగా పెట్టి తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్‌ హయతీ, మీనా చౌదరి కనిపించనున్నారు.పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu