Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

FilmyFocus 3 weeks ago

సుకుమార్ స్కూల్ నుండి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న దర్శకుల్లో బుచ్చిబాబు సానా ఒకడు. 'ఉప్పెన' తో స్ట్రాంగ్ డెబ్యూ ఇచ్చాడు బుచ్చిబాబు. తొలి సినిమాతోనే అల్మోస్ట్ రూ.100 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్నాడు.

Mahesh Babu

ఇప్పుడు టాలీవుడ్ కళ్ళు అన్నీ ఆయన తెరకెక్కిస్తున్న 'పెద్ది' పైనే ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఆల్రెడీ 'పెద్ది' షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది చిత్ర బృందం. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఒక ప్రత్యేక గీతంలో శృతి హాసన్ తన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేయనుంది. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రంతో పూర్తిస్థాయి నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. ‘పెద్ది’ సినిమా నుండి రెండు పాటలు వచ్చాయి. రెండూ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

సొ ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టడం ఖాయం. అందుకే అదే కాన్ఫిడెన్స్ తో తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు బుచ్చిబాబు. ఇటీవల అతని నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో ఉంటుందంతూ ప్రచారం జరిగింది. కానీ ప్రభాస్ ఇప్పట్లో ఖాళీ అవ్వడం కష్టం. అందుకే మహేష్ తో(Mahesh Babu) సినిమా చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాడట బుచ్చిబాబు.

‘వారణాసి’ తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ బుచ్చిబాబు మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు వినికిడి. మహేష్ బాబు వద్ద ‘మైత్రి..’ వారి అడ్వాన్స్ ఉంది. బుచ్చిబాబుకి కూడా కొంత అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం ఉంది. గతంలో మహేష్ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాకి బుచ్చిబాబు కూడా అసిస్టెంట్ గా పనిచేసిన సంగతి చాలా మందికి తెలిసే ఉండొచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu