తెలుగు సినిమా వర్గాలు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం ఇప్పటివరకు పెద్దగా కాంట్రవర్శీలు లేని ఓ కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్..
కాంట్రవర్శీలను పాకెట్‌లను పట్టుకుని తిరిగే మాజీ న్యూస్ రీడర్/ యాంకర్/ రిపోర్టర్, ప్రస్తుతం ఆర్టిస్ట్ అయిన జాఫర్ మధ్య జరిగిన చిన్న పాటి చర్చ వీడియోనే. ఓ ఇంటర్వ్యూలో ఇద్దరూ మాట్లాడుతుండగా కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను గెటప్ శ్రీను చెబుతాడు. దానికి వచ్చిన రియాక్షనే ఇప్పుడు ఈ కుంపటికి కారణం అని చెప్పొచ్చు.
Memu Kapulam
టాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా నివురు గప్పిన నిప్పులా ఓ విసయం నడుస్తూ ఉంది. ఈ మాటను చాలామంది ఒప్పుకోకపోయినా తెలుగు సినిమాలో అయితే వర్గపోరు ఒకటి ఉందని అంటుంటారు. రెండు కాస్ట్‌ల మధ్య పోటాపోటీ మాటలు కూడా అప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ పాయింట్‌కి దగ్గరగానే ఈ వీడియో కనిపిస్తుండటం గమనార్హం. కొత్త ప్రాజెక్ట్ ఏంటి అని గెటప్ శ్రీనును జాఫర్ అడగ్గా.. 'మేం కాపులం' అని చెబుతాడాయన. దాంతో కాస్ట్ పేరు మీద సినిమాలేంటి అంటూ జాఫర్ తిరిగి ప్రశ్నిస్తారు. ఇదీ ఆ వీడియోలో కనిపిస్తోంది.

