Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mirai2: సైలెంట్ గా 'మిరాయ్ 2' షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా 'మిరాయ్ 2' షూటింగ్.. పెద్ద షాక్ ఇది

FilmyFocus 4 days ago

‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టిజి విశ్వప్రసాద్ నిర్మించారు.

Mirai2

గతేడాది అంటే 2025 సెప్టెంబర్ 13న రిలీజ్ అయిన ‘మిరాయ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాలోని వీఎఫ్ఎక్స్ వర్క్ కి మంచి అప్రీషియేషన్ వచ్చింది. వాటి కారణంగానే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా.. ‘మిరాయ్’ కి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. సినిమా క్లైమాక్స్ లో లీడ్ కూడా ఇచ్చారు.సీక్వెల్ లో రానా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా లీడ్ ఇచ్చారు.. కానీ అది విలన్ పాత్ర అంటూ టాక్ వినిపించింది. అయితే సీక్వెల్ కి లీడ్ ఇచ్చినప్పటికీ ఇప్పట్లో ఈ సినిమా ఉంటుందా? అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఫైనల్ గా ఆ డౌట్స్ కి ఓ క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. ‘మిరాయ్ 2’ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లబోతుంది.

వెళ్లడం కాదు.. సైలెంట్ గా షూటింగ్ కూడా మొదలుపెట్టేసినట్టు టాక్ నడుస్తుంది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని, హీరో తేజ సజ్జా, టిజి విశ్వప్రసాద్.. లు అప్పుడే 'మిరాయ్ 2' ని పూజా కార్యక్రమాలతో ఇటీవల ప్రారభించేసినట్టు సమాచారం. తొలి షెడ్యూల్లో భాగంగా వైజాగ్‌లో కొన్ని అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు అని తెలుస్తోంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో పాటు తేజ సజ్జ కూడా గత కొన్ని నెలలుగా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్టు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu