Dailyhunt
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

FilmyFocus 2 weeks ago

స్కార్‌ అవార్డుల విషయంలో గత కొన్నేళ్లుగా ఓ చర్చ నడుస్తూనే ఉంది. అదే నటుల నామినేషన్‌. చాలా ఏళ్లుగా నటీనటులు ఒక విభాగంలో ఒక సినిమాకు మాత్రమే నామినేట్‌ అయ్యే అవకాశం ఉంది.

దీంతో ఒకటికి మించిన నామినేషన్లు ఉండే అవకాశం లేక నటులకు అవార్డులు వచ్చే అవకాశం తగ్గుతూ వచ్చింది. ఈ విషయంలో అకాడెమీ అవార్డ్స్‌ మార్పులు చేసింది. ఈ మేరకు ఆస్కార్స్‌ కీలక ప్రకటన చేసింది.

Oscars

2027 ఆస్కార్ అవార్డులకు సంబంధించి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ యాక్టింగ్‌, అంతర్జాతీయ సినిమాలు, సాంకేతిక విభాగాల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం ఒకే నటుడు ఒకే జాబితాలో రెండు వేర్వేరు సినిమాలకు నామినేట్ అయ్యే అవకాశం కల్పించారు. దీని వల్ల టాలెంట్‌ ఉన్న నటులు ఒకే ఏడాది ఎన్ని చిత్రాల్లో గొప్ప ప్రదర్శనలు ఇస్తే అన్నీ నామినేషన్‌ చేసుకునే అవకాశం కలిగింది.

అలాగే, అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో కూడా అకాడమీ అవార్డ్స్‌ కీలక మార్పులు చేసింది. ఇప్పుడు ఒక దేశం నుండి ఒకటి కంటే ఎక్కువ సినిమాలు నామినేషన్లకు అర్హత సాధించే అవకాశం కల్పించారు. దీంతోపాటు కేన్స్ తదితర ప్రముఖ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో పురస్కారాలు అందుకున్న సినిమాలు నేరుగా ఆస్కార్ బరిలో పోటీపడే అవకాశాన్ని కల్పించింది. అలాగే అంతర్జాతీయ సినిమా కేటగిరీలో విజేతకు ఇచ్చే ట్రోఫీపై ఆ దేశం పేరుతో పాటు దర్శకుడి పేరును కూడా ఇవ్వనున్నారు.

ఇదిలా ఉండగా.. సినిమా రంగంలో కీలకంగా పెరుగుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై ఆస్కార్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. స్క్రీన్‌ప్లే రైటింగ్ విభాగంలో రచయితలు రాసిన కథలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఏఐ సహాయంతో రాసిన స్క్రిప్ట్‌లను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు యాక్టింగ్‌లో కూడా ఏఐతో సృష్టించిన సీన్స్‌, మార్పులు అంగీకరించబోమని తెలిపింది. 99వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 14న లాస్ ఏంజిలెస్‌లో జరగనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu