Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi: మరో ట్రైలర్ అవసరమా 'పెద్ది'

Peddi: మరో ట్రైలర్ అవసరమా 'పెద్ది'

FilmyFocus 3 days ago

‘ఉప్పెన’ తో డెబ్యూ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు బుచ్చిబాబు సానా. ఆ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో కూడా చేరింది. తొలి సినిమాతోనే బుచ్చిబాబు టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు.

Peddi

2వ సినిమాని ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. అలా ‘పెద్ది'(Peddi) రూపొందింది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా, ఆ తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.

ఫైనల్ గా అది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ప్రమోషన్స్ భాగంగా విడుదల చేసిన రెండు గ్లింప్స్..లు, ‘చికిరి చికిరి’, ‘రైరై రారా’ వంటి పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మాత్రం ప్రేక్షకుల నుండి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. ‘పెద్ది’ కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు కథ, కథనాలపై కొంత క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే దర్శకుడు బుచ్చిబాబు ట్రైలర్‌ను హీరో ఎలివేషన్స్ వంటివి తగ్గించి కట్ చేయించాడు.

అందుకే రెస్పాన్స్ అలా వచ్చింది అనుకోవచ్చు. అయితే టాక్ ఎలా ఉన్నా.. ‘పెద్ది’ ట్రైలర్ 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మిక్స్డ్ టాక్‌తో కూడా ఈ స్థాయి వ్యూయర్ షిప్ తెచ్చుకోవడం అనేది సినిమాకున్న క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పుకోవాలి. అయితే ఈ చిన్నపాటి లోటు కూడా రిలీజ్ కి ముందు ఎందుకు? అని భావించిన మేకర్స్ ఇప్పుడు మరో ట్రైలర్ ని కట్ చేసే పనిలో పడ్డారని వినికిడి. సో ‘రిలీజ్ ట్రైలర్’ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ.. ‘పెద్ది’ నుండి మరో ట్రైలర్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu