Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi Trailer: 'పెద్ది' ట్రైలర్ రివ్యూ.. 'ఆటకూలీ పోరాటం'

Peddi Trailer: 'పెద్ది' ట్రైలర్ రివ్యూ.. 'ఆటకూలీ పోరాటం'

FilmyFocus 6 days ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో రూపొందిన పీరియాడిక్ అండ్ మాస్ ఎంటర్టైనర్ మూవీ 'పెద్ది'(Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషించారు.

Peddi Movie

జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్ప్స్, చరణ్ బర్త్ డే గ్లిమ్ప్స్,’చికిరి చికిరి’, ‘రైరై రారా’ సాంగ్స్ వంటివి ప్రేక్షకుల నుండీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ డోస్ పెంచింది ‘పెద్ది’ యూనిట్. ఇందులో భాగంగా.. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.’పెద్ది’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల 7 సెకండ్ల నిడివి కలిగి ఉంది. జగపతి బాబు పాత్రతో ట్రైలర్ మొదలైంది. ఆయన ఓ ట్రైన్ ని ఆపడం.. అటు తర్వాత ఊరు బ్యాక్ డ్రాప్ చూపించడం జరిగింది. ‘ప్లే మారినా ప్లేయర్ మారడు’ అనే డైలాగ్ తో రామ్ చరణ్ పాత్రని పరిచయం చేశారు.

అతను ఈ సినిమాలో ఓ ఆట కూలీగా కనిపించనున్నాడు. క్రికెటర్ గా, కుస్తీ ఫైటర్ గా, రన్నింగ్ ఛాంపియన్ గా కూడా అతను ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక జాన్వీ కపూర్ పాత్ర చాలా మాస్ గా ఉంది. ఓ పక్క డబుల్ మీనింగ్ డైలాగులు పలుకుతూ.. మరోపక్క గ్లామర్ వడ్డిస్తూ ఆమె పాత్ర ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. శివరాజ్ కుమార్ పాత్ర లుక్ పవర్ఫుల్ గా ఉంది. పాత్ర కూడా అదే రేంజ్లో ఉంటుందేమో చూడాలి.

కథనం ఎలా ఉండబోతుందో ఈ ట్రైలర్ ద్వారా చూపించారు.. కానీ కథపై మాత్రం హింట్ ఇవ్వలేదు. హీరో పట్నం వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ ఎందుకు కష్టపడుతున్నాడు అనే పాయింట్ పైనే బహుశా మెయిన్ స్టోరీ ఆధారపడి ఉంటుందేమో. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu