'గేమ్ ఛేంజర్' వంటి డిజాస్టర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో కష్టపడి చేసిన సినిమా 'పెద్ది' (Peddi). బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు.
'వ్రిద్ధి సినిమాస్' సంస్థపై వెంకట్ సతీష్ కిలారు ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మించారు. రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషించారు.
Peddi Movie Twitter Review
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలు, గ్లిమ్ప్స్, ట్రైలర్ వంటివి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది 'పెద్ది' సినిమా. ఆల్రెడీ చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా స్టార్టింగ్ సీన్ నుండి దర్శకుడు బుచ్చిబాబు కథలోకి ఆడియన్స్ ని తీసుకెళ్ళాడట. రామ్ చరణ్ ఎంట్రీ, రైరై రారా సాంగ్ అందరికీ మంచి కిక్ ఇస్తాయి అంటున్నారు. జాన్వీ కపూర్ ఎంట్రీ సీన్ కూడా బాగుంది అంటున్నారు.
ఆమె గ్లామర్.. బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసినట్టు ఉంటాయట.జగపతి బాబు పాత్ర… ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతాయట. సెకండాఫ్ స్టార్టింగ్ నుండి ఎమోషనల్ గా సాగుతుంది అంటున్నారు. క్లైమాక్స్ అయితే కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటుందని చెబుతున్నారు. రెహమాన్ సాంగ్స్, రత్నవేలు సినిమాటోగ్రఫీ అన్నీ సినిమాకి రిచ్ నెస్ తీసుకొచ్చాయట. మొత్తంగా 'పెద్ది' మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం గ్యారెంటీ అంటున్నారు. మరి బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

