Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Purna: 'జైలర్‌ 2' పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే.

Purna: 'జైలర్‌ 2' పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే.

FilmyFocus 1 week ago

'అలా బొలేలో..' అంటూ గత కొన్ని రోజులుగా సౌత్‌ సినిమా ప్రేక్షకులు తెగ ఊగిపోతున్నారు. 'జైలర్‌ 2' సినిమాలోని ఆ పాటలో నటి పూర్ణ తన డ్యాన్స్‌తో అదరగొట్టారు.

ఈ క్రమంలో రజనీకాంత్‌ను ఆమె డామినేట్‌ చేసేశారు అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ విషయం పక్కన పెడితే.. ఆ పాటకు ఆమె ఎంతగా హెల్ప్‌ అయ్యారో పాట విజయం చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి అవకాశం పూర్ణకు ఎలా వచ్చిందో ఆమెనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Purna

'అలా బొలేలో..' పాట షూటింగ్ చాలా నెలల క్రితమే అయిపోయింది. ఎందుకంటే 'అఖండ 2: తాండవం' సినిమా షూటింగ్‌ అవుతున్న సమయంలోనే ఈ పాట షూటింగ్‌ జరిగింది. మొత్తంగా ఆరు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారట. పాటను ముగించి, 'అఖండ 2' షూటింగ్‌లో ఉండగానే తాను ప్రెగ్నెంట్‌ అని తెలిసిందట. అందుకే తన బిడ్డను జైలర్‌ బేబీ అని పిలుచుకుంటోందట పూర్ణ. ఇక ఆ పాట అవకాశం ఆమెకు 'గుంటూరు కారం' సినిమా ఇచ్చిందట.

ఆ సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి..' పాట అంటే దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌కి బాగా ఇష్టమట. ఆ పాట చూశాకే 'అలా బొలేలో..' పాటలో పూర్ణకు అవకాశమిచ్చారట. అలాగే 'జైలర్‌'లో 'కావాలయ్యా..' పాటతో ఈ పాటను పోలుస్తారని ముందే అనుకుందట పూర్ణ. అనుకున్నట్లుగానే ఆ పాటతో పోల్చారు కూడా. రజనీకాంత్‌ 'నరసింహ' / 'పడయప్ప' సినిమా అంటే తనకు ఇష్టమని.. అందులోని నీలాంబరి పాత్ర కూడా నచ్చుతుందని.. తనలో కాస్త నీలాంబరి పాత్ర కనిపిస్తుంటుంది అని కూడా చెప్పారు పూర్ణ.

ఇక 'జైలర్‌ 2' సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను అక్టోబరు 15న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో ఆరుగురు ఇతర భాషలకు చెందిన నటులు అతిథి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈసారి కూడా తెలుగు నటులు ఎవరూ లేరు అని చెబుతున్నారు. హిందీ నుండి హృతిక్‌ రోషన్‌, తమిళం నుండి విజయ్‌ సేతుపతి, కన్నడ నుండి శివ రాజ్‌ కుమార్‌, మలయాళం నుండి మోహన్‌ లాల్‌ కనిపిస్తారని టాక్‌.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu