Dailyhunt
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన 'రాకాస'.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన 'రాకాస'.. కానీ

FilmyFocus 1 week ago

నిర్మాతగా చేసిన తొలి సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'తో భారీ విజయాన్ని అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. దీని తర్వాత హారర్ ఫాంటసీ జోనర్లో 'రాకస'( Raakaasaa ) చేసింది.

Raakaasaa

సంగీత్ శోభన్‌, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాతో మానస శర్మ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. గెటప్ శీను, వెన్నెలకిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ప్రీమియర్స్ షోలు కూడా వేశారు. వాటికి పాజిటివ్ టాక్ వచ్చింది.దీంతో బాక్సాఫీస్ వద్ద బాగానే ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి సోమవారం కూడా ఓకే అనిపించింది. కానీ అనుకున్న రేంజ్లో కాదు. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే

తెలంగాణ2.71 cr
సీడెడ్0.60 cr
ఆంధ్ర(టోటల్) 2.06 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)5.37 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్2.29 cr
వరల్డ్ వైడ్ టోటల్7.66 cr(షేర్)

‘రాకాస’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.14.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు ముగిసేసరికి ఈ సినిమా రూ.7.66 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.13.25 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.34 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అల్మోస్ట్ సగానికి సగం టార్గెట్ ని రీచ్ అవ్వాలి. వీక్ డేస్ లో నిలకడగా రాణించి.. 2వ వీకెండ్ కి మళ్ళీ గ్రోత్ చూపిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి.

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu